https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కి తెలంగాణ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అంటున్న రామ్ గోపాల్ వర్మ…

Allu Arjun: ముఖ్యంగా ఆరోజు రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ఆయన చాలా వరకు చింతిస్తున్నానని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అయితే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక దాంతో పాటుగా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ ట్వీట్ ను సోషల్ మీడియా మొత్తం వైరల్ చేసే పని పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2024 / 08:05 PM IST
    Follow us on

    Allu Arjun:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏం చేసినా కూడా రామ్ గోపాల్ వర్మ మాత్రం తనకంటూ ఒక మార్కు ను చూపిస్తూ ఏదో ఒక ట్వీట్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక తన సినిమాలు చేయడం ద్వారానే కాకుండా ట్వీట్లు చేయడం ద్వారా కూడా చాలా ఫేమస్ అయ్యాడనే చెప్పాలి…
    తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ…ఈయన తనదైన రీతిలో సెలబ్రిటీలు మీద తనకు నచ్చిన ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఇక దానికి అనుగుణంగానే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ ని ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ అయితే చేశాడు. అదేంటి అంటే ‘తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధికమైన వసూళ్లను రాబడుతూ భారీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటూ పుష్ప 2 సినిమా ముందుకు దూసుకెళ్తుంది… ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచినందుకు ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ అరెస్టు చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అంటూ తను చేసిన ట్వీట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక దానికి అనుగుణంగానే బన్నీ మీద కొన్ని కేసులు అయితే నమోదు అయ్యాయి. ఇక పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక అతనికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఎట్టకేలకు ఆయన ఒకరోజు మాత్రం జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మొత్తానికైతే ఈరోజు పొద్దున వాళ్ళ ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో కూడా మాట్లాడాడు.
    ముఖ్యంగా ఆరోజు రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ఆయన చాలా వరకు చింతిస్తున్నానని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అయితే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక దాంతో పాటుగా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ ట్వీట్ ను సోషల్ మీడియా మొత్తం వైరల్ చేసే పని పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.
    తెలుగు సినిమా స్థాయిని మరోసారి బాలీవుడ్ లో నిరూపించిన మన హీరోకి తెలంగాణ గవర్నమెంట్ మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వల్ల చాలామంది అల్లుఅర్జున్ అభిమానులు రామ్ గోపాల్ వర్మను కీర్తిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడే కాదు  ఇంతకుముందు ఆర్జీవీ కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తు చాలా వరకు ట్వీట్ అయితే వేశాడు. ఇక ఇప్పుడు ఆయన అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.
    ముఖ్యంగా రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా దానికంటూ ఒక పర్పస్ అయితే ఉంటుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ట్వీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…