https://oktelugu.com/

Srikanth : గేమ్ చేంజర్ లో విలన్ ఎవరో చెప్పేసిన శ్రీకాంత్…సినిమా మామూలుగా ఉండదు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : December 14, 2024 / 08:31 PM IST

    Srikanth

    Follow us on

    Srikanth :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు…ఇక ఇదిలా ఉంటే రాజమౌళితో చేసిన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనకు పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపైతే వచ్చింది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. మెగా పవర్ స్టార్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న విధానం అద్భుతమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ రామ్ చరణ్ అభిమానులు ఇప్పటికే మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇందులో శ్రీకాంత్ కూడా ఒక డిఫరెంట్ పాత్రనైతే పోషిస్తున్నాడనే చెప్పాలి. ఒక పొలిటీషియన్ గా తను పోషిస్తున్న పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందట.

    ఇక రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని అసక్తికరమైన విషయాలను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఫస్ట్ టైమ్ ఆయన పొస్థటిక్ మేకప్ లో నటించానని కూడా చెప్పాడు. ఇక అందులో నటించడం కష్టమని అందరూ చెబుతుంటే విన్నాను కానీ ఫస్ట్ టైమ్ నేను ఎక్స్పీరియన్స్ చేశానని కూడా చెప్పాడు. ఇక మొత్తానికైతే ఆయన అదే గెటప్ లో వాళ్ళింటికి వెళ్తే ఇంట్లో వాళ్ళ నాన్న కూడా అతన్ని చూసి భయపడ్డారని చెప్పడం విశేషం…

    శంకర్ ఈ కథని తనకు చెబుతున్నప్పుడు ఫస్టాఫ్ విన్న తర్వాత ఇది నాకెందుకు చెప్తున్నాడు అనుకున్నారట. కానీ సెకండ్ హాఫ్ స్టోరీ లోకి వెళ్లిన తర్వాత ఈ పాత్రని తను మిస్ అయితే మాత్రం ఇలాంటి పాత్ర మరొకటి దొరకదని అప్పటికప్పుడే నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పేసారట. ఇక ఈ పాత్ర కూడా చాలా అల్టిమేట్ గా ఉండబోతుంది అంటూ ఆయన చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…

    ఇక తన పాత్రలో నెగెటివ్, పాజిటివ్ అన్ని షేడ్స్ కనిపిస్తాయని కూడా చెబుతున్నాడు. అదేవిధంగా ఆయన పాత్ర చాలా ట్విస్టులతో కూడుకొని ఉంటుందని కూడా చెప్పడం విశేషం…మరి తను ఇచ్చిన హింటు ప్రకారం ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించబోతున్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా జనవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఇప్పటినుంచే మెగా అభిమానుల్లో సంబరాలైతే మొదలయ్యాయి…