https://oktelugu.com/

Kanguva: సూర్య ‘కంగువ’ లో రెబల్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ కి ట్విస్టుల మీద ట్విస్టులు.. సరైన ప్లానింగ్ అంటే ఇదే!

ప్రముఖ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ చిత్రం రేపే విడుదల అవ్వాలి. కానీ అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ 'వెట్టియాన్' చిత్రం కూడా విడుదల అవ్వబోతుండడంతో క్లాష్ కి రావడం ఇష్టం లేక తన సినిమాని వాయిదా వేయించాడు సూర్య.

Written By:
  • Vicky
  • , Updated On : October 9, 2024 / 04:52 PM IST

    Kanguva

    Follow us on

    Kanguva: సుమారుగా మూడేళ్ళ తర్వాత సూర్య నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘కంగువ’. 2022 వ సంవత్సరం లో ఆయన ‘ఈటీ’ అనే చిత్రం ద్వారా అభిమానులను పలకరించాడు. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు తీసిన సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈమధ్య కాలంలో సూర్య అభిమానులు సంపూర్ణంగా సంతృప్తి చెందింది రోలెక్స్ పాత్ర ద్వారా మాత్రమే. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో ఈ కేవలం 5 నిమిషాలు మాత్రమే ఈ పాత్రలో ఆయన కనిపిస్తాడు. ఆ 5 నిమిషాల పాత్ర సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. నటన పరంగా అంత క్యాలిబర్ ఉన్న సూర్య ని తమిళ దర్శకులు సరిగా వాడుకోవట్లేదని అభిమానులు ఫీల్ అవుతూ ఉండేవారు. అలాంటి సమయంలోనే ‘కంగువ’ చిత్రాన్ని ప్రకటించాడు.

    ప్రముఖ దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ చిత్రం రేపే విడుదల అవ్వాలి. కానీ అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రం కూడా విడుదల అవ్వబోతుండడంతో క్లాష్ కి రావడం ఇష్టం లేక తన సినిమాని వాయిదా వేయించాడు సూర్య. అయితే ఈ సినిమా మీద కేవలం సూర్య అభిమానుల్లో కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అంతే కాదు తమిళ సినిమా ఇండస్ట్రీ ఇది మా బాహుబలి అని కూడా అంటుంది. సూర్య కి సౌత్ లో కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు, మలయాళం లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన మార్కెట్ ని సరిగా ఉపయోగించుకునే సినిమా పడకపోవడం వల్ల సూర్య బాగా వెనుకబడ్డాడు. కానీ ‘కంగువ’ చిత్రంతో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు . ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి రెబెల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. త్వరలోనే ఆయన డబ్బింగ్ చెప్పబోతున్నాడట. సూర్య, ప్రభాస్ కి మధ్య మంచి స్నేహం ఉంది.

    గతం లో సూర్య సినిమా తెలుగులో విడుదల అవుతున్న సందర్భంలో ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి సూర్య కి శుభాకాంక్షలు తెలియచేసాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గతం లో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ చనువుతోనే కంగువ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తావా అని అడగగానే క్షణం కూడా ఆలోచించకుండా ఎప్పుడో చెప్పు డార్లింగ్ ఇచ్చేస్తాను అని చెప్పాడట ప్రభాస్. ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, ఈ వార్తతో మరింత అంచనాలను రెట్టింపు చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సూర్య ‘కంగువ’ అనే అడవి వీరుడిగా, గూఢచారి గా ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో సూర్య భారీ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.