Shiva Re Release: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి సినిమా ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కుతూ ఉండేవి. చాలా సినిమాలు అలానే వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి. అలాంటి ఒక మూస ధోరణిలో వెళుతున్న సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… శివ సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి సినిమా తీసే విధానం చూసే పద్ధతి రెండు మారిపోయాయి. ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతను ఒక టార్చ్ బేరర్ లా మారాడనే చెప్పాలి. అప్పటినుంచి సినిమా విజువల్స్ గాని, వినే ఆడియో గాని మొత్తం మార్చేసాడు… మొత్తానికి వర్మ అలాంటి ఒక కొత్త డిసిజన్ తీసుకొని కొత్త మేకింగ్ ని తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే అప్పటిదాకా సినిమాల్లో ఫైటింగ్ చేసుకుంటే వచ్చే సౌండ్ అతనికి నచ్చదు కాదట. అందువల్లే ఆ సౌండ్ మొత్తాన్ని మార్చేయాలని తను ముందే ఫిక్స్ అయ్యారట.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ – ఆర్జీవీ కాంబోలో రావాల్సిన మూవీ మిస్ అవ్వడానికి కారణం ఎవరు..?
ఇక దాంతోపాటుగా రియలెస్టిక్ సౌండ్స్ ఉంటే సినిమా మీద ప్రేక్షకుడికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని సినిమాని చూసేటప్పుడు వాటిని ఎంజాయ్ చేస్తూ తన చుట్టూ జరిగే పరిస్థితుల్లో తను ఉన్నాడు అని ఒక రియలెస్టిక్ ఫీలింగ్ కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇలాంటి సౌండ్లను తీసుకోవాలని అతనికి ఐడియా ఎలా వచ్చింది అంటే కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు అవి చాలా రియాలెస్టిక్ గా అనిపించాయట… అందువల్లే తను కూడా అలాంటి ఒక సౌండ్ ని ఆడ్ చేయాలనే ఉద్దేశ్యంతో వర్మ తీసుకున్న డెసిజన్ చాలా గొప్పదనే చెప్పాలి. ఆ ఒక్క నిర్ణయం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది…
ఇక ప్రస్తుతం శివ సినిమా రీ రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తోందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ల రూపంలో భారీ ఎత్తున రికార్డులను బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న ఈ సినిమా రీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సత్తా చాటుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…