Mahesh Babu on Tamil directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధించిన స్టార్ హీరోలందరు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు. కారణమేదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి నటుడు సైతం కేవలం తెలుగు దర్శకులతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసినప్పుడు చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ లను సాధించిన దాఖలలైతే లేవు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో నాని అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…
ఇక ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ సినిమా చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోగా భారీ విమర్శలను కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక మీదట తమిళ దర్శకులతో సినిమాలు చేయకూడదని అప్పుడే ఫిక్స్ అయ్యారట.
ఇప్పటికి తమిళ డైరెక్టర్లు మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అతనికి కథ వినిపించడానికి చాలా వరకు సన్నాహాలు చేసిన కూడా అవేవీ వర్కౌట్ కావడం లేదు. మొత్తానికైతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తన స్టోరీని విన్న మహేష్ బాబు ఫైనల్ కూడా చేశారట.
అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా తొందరలోనే రాబోతుంది అంటూ అతని సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి…ఇక ఇప్పటి వరకు సందీప్ మహేష్ బాబు కి నాలుగు స్టోరీలను చెప్పాడట. వాటిలో ఒక్కటి మాత్రమే ఫైనల్ చేశాడు…మరి ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబోలో ఒక పవర్ ఫుల్ సినిమా వస్తుందనేది వాస్తవం…