RC17 Update : ‘పెద్ది’ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రమిది. కాబట్టి అంచనాలు సహజంగానే భారీ రేంజ్ లో ఉంటాయి. అందులోనూ ‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన తర్వాత సుకుమార్ చేయబోతున్న చిత్రమిది. అందుకే స్క్రిప్ట్ వర్క్ విషయం లో ఎక్కడా కూడా రాజీ లేకుండా డైరెక్టర్ సుకుమార్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ముందుగా పీరియడ్ డ్రామా చెయ్యాలని అనుకున్నారు, కానీ చివరికి స్టైలిష్ యాక్షన్ జానర్ ని లాక్ చేశారు. ఈ ఏడాది దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ ఉంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. కేవలం ఒక భాగం లోనే ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చెయ్యాలని చూస్తున్నారట సుకుమార్. రంగస్థలం , పెద్ది చిత్రాలు మాదిరిగానే , రామ్ చరణ్ కి పెర్ఫార్మన్స్ పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే రాశారట సుకుమార్. అంతే కాదు , రామ్ చరణ్ క్యారెక్టర్ కి ఒక ప్రత్యేకమైన మ్యానరిజం కూడా ప్లాన్ చేశారట సుకుమార్. సాధారణంగా యాక్షన్ జానర్ సినిమాల్లో వళ్ళు గగురుపొడిచే సాహసోపేతమైన ఛేజ్ లు , ఫైట్లు , ఎలివేషన్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి యాక్షన్ జానర్ లో గుండెల్ని పిండేసే డ్రామా ని జత చేయడం చాలా కష్టం. ఒకవేళ ఆ డ్రామా మిస్ ఫైర్ అయితే సినిమా ఫైనల్ ఔట్పుట్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది.
గతం లో ఎన్నో సినిమాలకు ఇలాంటివి జరిగాయి. సుకుమార్ ఈ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొని స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్నారట. ఒక యాక్షన్ ఎంటర్టైనర్ లో, డ్రామా కి ఆడియన్స్ కనెక్ట్ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయి లో ఉంటుంది. అది #RC17 లో మనం చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియా లో చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా మొదలు పెట్టారట సుకుమార్. ఇప్పటికే ఈ చిత్రం లోని ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం నయనతార ని ఎంచుకున్నట్టు టాక్. అదే విధంగా హీరోయిన్ పాత్ర కోసం రుక్మిణి వాసంత్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.
