Puri Jagannath: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందు బోల్తాపడింది. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన లైగర్ ప్లాప్ కావడంతో అందరు అవాక్కయ్యారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను పాన్ ఇండియా స్థాయిలో చూపించాలని భావించిన పూరి కలలు కల్లలు అయ్యాయి. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి కావడంతో నిర్మాతల్లో కంగారు పుడుతోంది. లైగర్ సినిమా ఫెయిల్ కావడంతో ఏం చేయాలో తోచడం లేదు. విజయ్ దేవరకొండ తన పారితోషికంలో నుంచి ఆరు కోట్లు తిరిగి ఇచ్చి నష్టాల్లో తాను భాగస్తుడిని కావాలని అనుకోవడం ఆహ్వానించదగినదే.
లైగర్ సినిమా తర్వాత జనగణమన కూడా పాన్ ఇండియా స్థాయిలో తీయాలని కలలు కన్న పూరి కలలు లైగర్ తో అడ్డం తిరిగాయి. లైగర్ నిర్మాణ సమయంలో ముంబైలో ఓ విల్లా అద్దెకు తీసుకుని అక్కడి నుంచే షూటింగ్ చేశారు. దానికి నెలకు రూ. 10 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైగర్ అనుకున్న స్థాయికి చేరకపోవడంతో ఇక ఆ విల్లాను ఖాళీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. ఇప్పుడు పూరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భవిష్యత్ లో కూడా మరిన్ని ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Ram Charan- Shankar Movie: షాకింగ్ : చరణ్ – శంకర్ సినిమా విజువల్స్ లీక్.. ఇలా అయితే ఎలా ?
ఇప్పటికే బయ్యర్లకు చెల్లించాల్సిన బకాయిలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సమావేశం కావాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. దీంతో వారి నష్టాల్లో కొంతైనా చెల్లించి వారిని ఊరడించాలని చూస్తున్నారు. లైగర్ సినిమాను పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించారు. కానీ నష్టాలు రావడంతో అందరికి ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో లైగర్ నిర్మించిన వారికి ఎంతో కొంత సాయం అందజేసి నష్టాలను పూడ్చాలని భావిస్తున్నారు. లైగర్ కనీస బడ్జెట్ కూడా సాధించలేకపోవడం గమనార్హం.
లైగర్ సినిమా సెప్టెంబర్ 30న ఓటీటీలో కూడా అందుబాటులోకి రానుంది. పూరి భవిష్యత్ ప్రాజెక్టు జనగణమన కూడా ఆగిపోనుంది. లైగర్ ఫెయిల్యూర్ తో పూరి ఆశలు అడియాశలయ్యాయి. ఎన్నో ఆశలతో తీసిన లైగర్ సినిమా నిరుత్సాహపరచడం అందరిని ఇబ్బందులకు గురిచేస్తోంది. పూరికి ఎన్ని కష్టాలు వచ్చాయని అందరు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారడంతో భవిష్యత్ ఆశలపై ప్రభావం పడుతోంది.