RB Choudary Death: ప్రముఖ లెజండరీ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందడం ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని శోకసంద్రం లోకి నెట్టేసింది. రాజస్థాన్ లో ఒక కారు యాక్సిడెంట్ లో ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది . తెలుగు , తమిళం , హిందీ భాషల్లో 100 కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన చరిత్ర ఆయనది. విక్టరీ వెంకటేష్ , మెగాస్టార్ చిరంజీవి లతో ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించాడు. అదే విధంగా నేటి తరం స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’, రామ్ చరణ్ తో ‘రచ్చ’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసాడు. ఇలా వరుసగా మంచి సినిమాలు తీయడం వల్ల, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా , ఈ బ్యానర్ నుండి వస్తే చాలు సూపర్ హిట్ అనే రేంజ్ లో ఆడియన్స్ లో ఒక ముద్ర పడింది.
అలాంటి సినిమాలను నిర్మించిన ఆయన నేడు తిరిగి రాని లోకాలకు పయనం అవ్వడం దురదృష్టకరం. ఆయన లేని లోటు ఎవ్వరూ పూడవలేనిది. ఇక ఆయన కుమారుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన జీవా కూడా తమిళనాడు లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన హీరో గా నటించిన ‘రంగం’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం వంద రోజులకు పైగా ఆడింది. ప్రస్తుతానికి ఈ హీరో ఫార్మ్ లో లేడు కానీ, మంచి కమర్షియల్ సినిమా చేస్తే భారీ కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆర్బీ చౌదరి మరణం పై తెలుగు , సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ట్వీట్లు వేస్తూ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఆర్బీ చౌదరి తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.