Jiiva Emotional Video: ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి నిన్న రాజస్థాన్ లో కారు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం తెలుగు , తమిళ సినీ ఇండస్ట్రీ ప్రముఖులను తీవ్ర స్థాయి దిగ్బ్రాంతికి గురి చేసింది. రెండు ఇండస్ట్రీస్ లోనూ ఆయన దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ ని పెట్టి సినిమాలను నిర్మించాడు. ‘మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అనే సంస్థకు తిరుగులేని పేరు ప్రఖ్యాతలు , బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాడు. జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాలను అందించిన ఆర్బీ చౌదరి , ఇలా అకస్మాత్తుగా, అది కూడా రోడ్డు ప్రమాదం లో చనిపోవడం దురదృష్టకరం , ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీ లో ఎవ్వరూ పూడవలేనిది. ఇకపోతే ఆర్బీ చౌదరి కి తెలుగు , తమిళ భాషల్లో దాదాపుగా అందరి హీరోలతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. వారిలో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కూడా ఉన్నాడు.
ఆయనతో ఆర్బీ చౌదరి గతంలో 6 సినిమాలు చేసాడు. అందులో అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యినవే ఉన్నాయి. అదే విధంగా ఆర్బీ చౌదరి కుమారుడు , హీరో జీవ తో కూడా విజయ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరు కలిసి గతం లో శంకర్ దర్శకత్వం లో ‘3 ఇడియట్స్’ రీమేక్ ‘నంబన్’ అనే చిత్రం లో నటించారు. తెలుగు లో ఈ చిత్రం ‘స్నేహితుడు’ అనే పేరుతో డబ్ అయ్యింది. ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇదంతా పక్కన పెడితే విజయ్ నేడు ఆర్బీ చౌదరి పార్థివ దేహాన్ని సందర్శించి , కుటుంబానికి తన సంతాపం ని వ్యక్తం చేశాడు. ఇక విజయ్ ని చూడగానే జీవా గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నిన్నటి నుండి జీవా తన తండ్రి చనిపోయిన వార్త ని తెలిసినప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాడు. పాపం అతన్ని చూసిన తర్వాత నెటిజెన్స్ తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు.
మొన్న విజయ్ టీవీకే పార్టీ గెలవగానే జీవ సంబరాలు చేసుకుంటూ ఒక వీడియో ని తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే తన తండ్రి చనిపోవడం , విజయ్ ని సంతోషంతో కలవాల్సిన సందర్భంలో , ఇలా బాధతో కలవడం, నిజంగా చాలా దురసృష్టకరమైన సంఘటన అనే చెప్పాలి.
. @TVKVijayHQ @JiivaOfficial pic.twitter.com/utNaEJMbUG
— Laxmi Kanth (@iammoviebuff007) May 6, 2026