Pawan Kalyan Raviteja past story: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు…ప్రస్తుతం మన హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఢీ కొట్టే విధంగా సినిమాలను చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఆయన చేసిన సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నాడు. గత సంవత్సరం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఒకానొక టైం లో పవన్ కళ్యాణ్ రవితేజతో మాట్లాడాలని ప్రయత్నం చేసిన కూడా రవితేజ పవన్ కళ్యాణ్ ను పట్టించుకోలేదట.
అసలేం జరిగిందంటే చిరంజీవి హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు లో సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీని మళ్ళీ హిందీలో రీమేక్ చేశారు. ‘ఆజ్ క గుండా రాజ్’ అనే పేరుతో రీమేక్ చేసిన ఈ సినిమాలో రవితేజ ఒక క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఆ సినిమా చూసిన పవన్ కళ్యాణ్ కి రవితేజ క్యారెక్టర్ బాగా నచ్చిందట.
Also Read: విజయ్ దేవరకొండ రణబాలి సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఏంటి అలా ఉంది..?
ఇక సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు రవితేజతో పవన్ కళ్యాణ్ మాట్లాడాలని ప్రయత్నం చేసిన కూడా రవితేజ అప్పుడు పవన్ కళ్యాణ్ ను పట్టించుకోలేదట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదు. కాబట్టి ఆయన తనతో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడలేదట.ఆ తర్వాత ఆయన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అని తెలిసిన వెంటనే రవితేజ సారీ చెప్పి తనతో మాట్లాడినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సైతం కొన్ని సందర్భాల్లో గుర్తు చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాప్ హీరోగా మారడమే కాకుండా రవితేజ సైతం స్టార్ హీరోగా మారిపోయాడు…వీళ్లిద్దరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…
