Ravi Teja Crack 2 : రవితేజ ‘క్రాక్ 2’ వచ్చేస్తుంది..ఈసారి మరింత ఊర మాస్ గా కనిపించబోతున్న మాస్ మహారాజ్

గోపీచంద్ మలినేని కి మొదటి సినిమా అవకాశం ఇచ్చింది రవితేజ అనే విషయం అందరికీ తెలిసిందే. 'బలుపు' అనే సూపర్ హిట్ చిత్రం ద్వారా ఆయన ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక రీసెంట్ గానే బాలయ్య బాబు తో 'వీర సింహా రెడ్డి' అనే చిత్రం చేసి , భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Written By: Vicky, Updated On : May 23, 2023 9:40 am
Follow us on

Ravi Teja Crack 2 : మాస్ మహారాజ రవితేజ పని ఇక అయిపోయింది అని ఆనుకుంటున్న ప్రతీసారి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘రాజా ది గ్రేట్ ‘ వంటి భారీ హిట్ తర్వాత రవితేజ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ పలకరించాయి. ఆ సమయం లో ట్రేడ్ పండితులందరూ రవితేజ మార్కెట్ పూర్తి గా దెబ్బతినింది, ఇంకో ఫ్లాప్ పడితే ఆయన కెరీర్ ముగిసినట్టే అని అనుకున్నారు.

అలాంటి సమయం లో విడుదలైన ‘క్రాక్’ చిత్రం రవితేజ కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి కానుకగా విడుదలై సెన్సేషన్ సృష్టించింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజ ని విక్రమార్కుడు తర్వాత అంత పవర్ ఫుల్ గా ఈ చిత్రం లో చూపించాడు, తనకి జీవితాన్ని ఇచ్చిన హీరో కి కష్టసమయం లో గోపీచంద్ మలినేని ఆదుకున్నాడు.

గోపీచంద్ మలినేని కి మొదటి సినిమా అవకాశం ఇచ్చింది రవితేజ అనే విషయం అందరికీ తెలిసిందే. ‘బలుపు’ అనే సూపర్ హిట్ చిత్రం ద్వారా ఆయన ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక రీసెంట్ గానే బాలయ్య బాబు తో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం చేసి , భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం తర్వాత ఆయన రవితేజ తో మరో సినిమా సినిమా చెయ్యబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే రవితేజ ని కలిసి స్టోరీ చెప్పగా ఆయన ఎంతగానో నచ్చాడని, ‘టైగర్ నాగేశ్వర రావు’ షూటింగ్ అయిపోగానే ఈ చిత్రాన్ని ప్రారంభిద్దాం అని రవితేజ గోపీచంద్ తో అన్నాడట. ఈ సినిమా ‘క్రాక్’ చిత్రానికి సీక్వెల్ గా ఉండబోతుందని సమాచారం, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుంది మూవీ టీం.