https://oktelugu.com/

Bichagadu-2 4th Day Collection : మొదటి రోజు కంటే 4వ రోజు ఎక్కువ వసూళ్లు..బాక్స్ ఆఫీస్ వద్ద ‘బిచ్చగాడు 2’ ప్రభంజనం

మొత్తం మీద ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి 6 కోట్ల 80 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే అప్పుడే 80 లక్షల రూపాయిలు లాభం అన్నమాట, ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : May 23, 2023 / 09:34 AM IST
    Follow us on

    Bichagadu-2 4th Day Collection : మన టాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ దంచి కొడుతుంటాయి. ఇది వరకు ఎన్నో ఉదాహరణలు మనం చూసాము. ఇప్పుడు రీసెంట్ గా ‘బిచ్చగాడు 2 ‘ రూపం లో మరో ఉదాహరణ చూడబోతున్నాము. 2016 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా, తమిళ డబ్బింగ్ సినిమాగా విడుదలైన బిచ్చగాడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.

    మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ తీస్తే మన తెలుగు ఆడియన్స్ కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ఇచ్చారు. మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయం లో మాత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వచ్చేసింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల రూపాయలకు జరగగా, మూడు రోజుల్లోనే 5 కోట్ల 80 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

    సీక్వెల్ హైప్ తో వచ్చిన సినిమాకి వీకెండ్ వరకు మంచి వసూళ్లు రావడం సహజమే కదా, అందులో ఆశ్చర్యం ఏముందని ట్రేడ్ పండితులు అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి నాల్గవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో అయితే ప్రధానమైన టౌన్స్ లో ఈ చిత్రానికి మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజు కోటి రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చిందట.

    సమ్మర్ లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడిన టాలీవుడ్ సినిమాకి ఈ చిత్రం ద్వారా ఒక మంచి ఉపశమనం దొరికినట్టు అయ్యిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి 6 కోట్ల 80 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే అప్పుడే 80 లక్షల రూపాయిలు లాభం అన్నమాట, ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.