Homeఎంటర్టైన్మెంట్Amardeep Chowdhury: 'బిగ్ బాస్' ఫేమ్ అమర్ దీప్ 'సుమతీ శతకం' కోసం రవితేజ..వైరల్ అవుతున్న...

Amardeep Chowdhury: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్ దీప్ ‘సుమతీ శతకం’ కోసం రవితేజ..వైరల్ అవుతున్న వీడియో!

Amardeep Chowdhury: టీవీ సీరియల్స్, బిగ్ బాస్ రియాలిటీ షో, ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు అమర్ దీప్(Amardeep Chowdary). ఈయనకు సోషల్ మీడియా లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో, లేడీస్ లో ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఈ షో లో మాస్క్ లేకుండా తానూ ఎలా ఉండాలని అనుకున్నాడో, అలాగే ఉన్నాడు, ఒక్కశాతం కూడా నటించకపోవడం వల్ల, అతనిలోని కొన్ని యాంగిల్స్ ఆడియన్స్ కి నచ్చలేదు. అందుకే విన్నర్ గా నిలబడాల్సిన వాడు రన్నర్ గా నిలిచాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ సీజన్ లో విన్నర్ అసలు రంగు బయటపడడంతో అమర్ దీప్ కి ఇంకా ఫాలోయింగ్ పెరిగింది.

ఇది కాసేపు పక్కన పెడితే అమర్ దీప్ ఒక మంచి ఎంటర్టైనర్. ముఖ్యంగా డ్యాన్స్ విషయం లో ఇతను మన టాలీవుడ్ టాప్ డ్యాన్సర్స్ ని కూడా మ్యాచ్ చేయగలడు. ఆ రేంజ్ టాలెంట్ ఉంది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. హీరో అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఒక ప్రత్యేకమైన ప్యాకేజి లాగా ఉంటాడు అమర్ దీప్. ‘బిగ్ బాస్’ లోకి అడుగుపెట్టకముందే రెండు సినిమాల్లో హీరో గా నటించాడు. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ‘సుమతీ శతకం’ అనే చిత్రం ద్వారా మన ముందుకు ఈ నెల 6న రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది, థియేట్రికల్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. కానీ ఎందుకో మంచి కంటెంట్ ఇచ్చినప్పటికీ కావాల్సినంత రీచ్ రాలేదని అంతా అనుకున్నారు.

అమర్ దీప్ మాస్ మహారాజ రవితేజ కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్ 7’ గ్రాండ్ ఫినాలే లో ‘నువ్వు ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేస్తే, నీకు రవితేజ సినిమాలో నటించే అవకాశం ఉంటుంది’ అని నాగార్జున ఆఫర్ ఇవ్వడంతో, క్షణం కూడా ఆలోచించకుండా అమర్ దీప్ అప్పట్లో బయటకు రావడానికి సిద్ధం అవుతాడు. అంత పెద్ద వీరాభిమాని. సినిమాలోని కంటెంట్ బాగున్నప్పటికీ సరైన రీచ్ రావడం లేదు, కనీసం రవితేజ గారు అయినా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అంతా అనుకున్నారు. అమర్ అభిమానులు కోరుకున్న విధంగానే రవితేజ అమర్ దీప్ కి శుభాకాంక్షలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు. ‘నీ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ చూసాను , చాలా బాగుంది, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని రవితేజ చెప్పాడు. ఈ వీడియో ని మీరు కూడా చూడొచ్చు.

 

Ravi Teja Shares Best Wishes To Amardeep Chowdary | Hyper Aadi | Sumathi Satakam

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version