Ravi Teja comments on Pawan: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అంతో ఇంతో బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి. అది లేకుండా ఇక్కడ అవకాశాలు రాగడాజ్ చాలా కష్టంతో కూడుకున్న పని… మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఒక చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రవితేజ… ఈయన కెరియర్ స్టార్టింగ్ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లను చేసేవాడు. కానీ ఆ తర్వాత తను సోలో హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు…ఇక అప్పట్లో చిరంజీవి హీరోగా చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తెలుగులో పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. అందులో కూడా చిరంజీవి హీరోగా నటించడం విశేషం…చిరంజీవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో రవితేజ నటించాడు.
తన నటనకు మంచి గుర్తింపైతే వచ్చింది. అదే సమయంలో చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ కి రవితేజ యాక్టింగ్ బాగా నచ్చిందట. పవన్ కళ్యాణ్ కి రవితేజ తెలుసు కానీ అప్పటికి రవితేజ కి పవన్ కళ్యాణ్ తెలియదు… ఇక ఆ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంలో సక్సెస్ పార్టీ చేసుకున్నారట. అక్కడికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు.
పవన్ కళ్యాణ్ రవితేజ తో మాట్లాడాలని అనుకున్నాడట… అంతలోనే ఒక వ్యక్తి రవితేజ దగ్గరికి వెళ్లి మీతో కళ్యాణ్ గారు మాట్లాలనుకుంటున్నారు అని చెప్పాడట. అప్పుడు రవితేజ పవన్ కళ్యాణ్ ఎవరు నాకు తెలియదు అని చెప్పాడట. ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ తనను ఇంట్రడ్యూస్ చేసుకుని రవితేజతో మాట్లాడట.
పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు అని తెలుసుకొని రవితేజ తనకి సారీ చెప్పాడట. ఇక అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి రాలేదు. కాబట్టి ఎవరికీ తెలియదు…అలాగే తను పెద్దగా సినిమా ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అయ్యేవాడు కాదు…అందుకనే తను ఎవరికి పెద్దగా తెలిసేవాడు కాదు…