Revanth Reddy and YS Jagan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో( Telangana CM Revanth Reddy).. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భావ సారుప్యత ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎటువంటి పాలన అనుభవం లేకుండానే వీరు అధికారం చేపట్టారు. ఒక సాధారణ ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా ఉన్న రేవంత్ నేరుగా సీఎం కుర్చీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సైతం కూడా అంతే. ఆయన సైతం ఎంపీ తో పాటు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం మాత్రమే ఉంది. అయితే రేవంత్ కంటే జగన్ ప్రతిపక్ష నేత హోదా అనుభవం ఉంది. కానీ రేవంత్ ఆలోచనలు వేరు.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరు. అంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అభివృద్ధి చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందున్న టిడిపి ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపేయాలని చూశారు. ఇద్దరిలో అదే తేడా. అందర్నీ కలుపు కెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సోలో పెర్ఫార్మెన్స్ చేశారు.
పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం..
తాజాగా తెలంగాణలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుకు ( AP CM Chandrababu) సైతం ఆహ్వానం పంపారు. కానీ 2023లో గ్లోబల్ సమ్మిట్ పేరిట పెట్టుబడుల సదస్సు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆయన తన రాజకీయ మిత్రుడు కేసిఆర్ కు శత్రువు కాబట్టి. కేవలం ఆ ఆలోచనతోనే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కనీసం గౌరవించలేదు. గౌరవభావంతో చూసిన దాఖలాలు కూడా లేవు. అప్పటి మాజీమంత్రి కొడాలి నాని సైతం రేవంత్ రెడ్డిని పలుచన చేస్తూ మాట్లాడేవారు. ఏదైనా ఉంటే తాము నేరుగా కాంగ్రెస్ హై కమాండ్ తో మాట్లాడుకుంటాం అంటూ చెప్పుకొచ్చేవారు.
కేవలం రాజకీయపరంగానే..
రేవంత్ రెడ్డి అలా కాదు. బిజెపిని రాజకీయపరంగా ప్రత్యర్థిగా చూస్తారే తప్ప.. పాలనాపరంగా ఎంతో గౌరవభావంతో చూస్తుంటారు. ఢిల్లీ వెళ్లి తరచూ ప్రధాని నరేంద్ర మోడీని( pm Narendra Modi) కలుస్తుంటారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుంటారు. పొరుగు రాష్ట్రాలతో సైతం సఖ్యతగా మెలుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిని అనుసరించి ఇతర రాష్ట్రాలతో స్నేహం చేస్తూ వచ్చారు. 2023 వరకు కేసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఒకలా ఉండేవారు. చివరి ఏడాదిలో రేవంత్ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో చాలా మార్పు వచ్చింది. అప్పటివరకు మాటిమాటికి హైదరాబాద్ అనేవారు. ఎప్పుడైతే రేవంత్ అధికారంలోకి వచ్చారో హైదరాబాద్ అన్న మాట మరిచిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక బెంగళూరు రూట్ మార్చారు.