Mr Bachchan Collection: రవితేజ రెమ్యూనరేషన్ 8 కోట్లు..కానీ ‘మిస్టర్ బచ్చన్’ 3 రోజుల్లో రాబట్టింది ఎంతో తెలుసా!

ఈగల్ తర్వాత రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన 'మిస్టర్ బచ్చన్' చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది.

Written By: Gopi, Updated On : August 18, 2024 4:57 pm

Mr Bachchan Collection

Follow us on

Mr Bachchan Collection: మాస్ మహారాజ రవితేజ ఒక హిట్ ఇస్తే వరుసగా 5 ఫ్లాప్స్ ఇస్తాడు అనే టాక్ ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉంది. ఆయన రీసెంట్ సినిమాల పరిస్థితి చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది. ‘రాజా ది గ్రేట్’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ‘క్రాక్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమా తర్వాత ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఆ సమయంలో ఆయన నుండి వచ్చిన ‘ధమాకా’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ధమాకా’ తర్వాత ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’, ‘ఈగల్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి.

ఈగల్ తర్వాత రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. పాటలు సూపర్ హిట్ అవ్వడంతో సినిమా కూడా బాగుంటుంది అనే నమ్మకంతో ఈ చిత్రం ప్రీమియర్ షోస్ కి ఆడియన్స్ ఎగబడి వెళ్లారు. కానీ ప్రారంభ సన్నివేశం నుండి చివరి వరకు కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకి ఓపెనింగ్స్ సరిగా రాలేదు. ఇక రెండవ రోజు, మూడవ రోజు షేర్ వసూళ్లు అనేక ప్రధాన నగరాల్లో రావడం అతి కష్టం అయ్యింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు అతి కష్టం మీద 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు కేవలం 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మూడు రోజులకు రాగా, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

సినిమా బిజినెస్ దాదాపుగా 31 కోట్ల రూపాయిలు జరిగింది. ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ కి మించి ఒక్క పైసా కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో బయ్యర్స్ కి దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. రవితేజ ఈ సినిమా కోసం 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కనీసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కి మించే కలెక్షన్స్ ఫుల్ రన్ లో రాబోతున్నాయి, అంత వరకు సంతోషం అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.