Rama Rao On Duty Release Date Fix: క్రాక్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చాడు రవితేజ. ఈ విజయం రవితేజకు గంపగుత్తుగా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. క్రాక్ హిట్ తర్వాత నాలుగైదు చిత్రాలు ప్రకటించారు. ప్రకటించిన చిత్రాలు ఏక కాలంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే వరుసగా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. రవితేజ గత చిత్రం ఖిలాడి ఫిబ్రవరి 11న విడుదలైంది. ఖిలాడి విడుదలైన ఆరు నెలల్లో రవితేజ మరో చిత్రం విడుదలకు సిద్ధం చేశారు. రామారావు ఆన్ డ్యూటీ మూవీ మేకర్స్ విడుదల తేదీ ప్రకటించారు. జులై 29న రామారావు ఆన్ డ్యూటీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. రవితేజ రోల్ సరికొత్తగా దర్శకుడు డిజైన్ చేసినట్లు సమాచారం. రామారావు ఆన్ డ్యూటీ ప్రోమోలు ఆసక్తిరేపుతుండగా సినిమాపై హైప్ ఏర్పడింది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజకు జంటగా మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పీ, రవితేజ క్రియేటివ్ వర్క్ బ్యానర్స్ లో సుధాకర్ చెరుకూరి, రవితేజ నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read: Naga Chaithanya Thankyou Movie: నాగచైతన్యకు ఆ అగ్ర నిర్మాత అన్యాయం?

ఈ మూవీలో నటుడు వేణు తొట్టెంపూడి కీలక రోల్ చేస్తున్నారు. అలాగే నరేష్, పవిత్ర లోకేష్, నాజర్ నటిస్తున్నారు జూన్ 17న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జులై 29కి వాయిదా వేశారు. ఇక రవితేజ హీరోగా ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఏక కాలంలో రవితేజ ఈ చిత్రాలు పూర్తి చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 ప్రాజెక్ట్ లో రవితేజ కీలక రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. రవితేజ నటించడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read:Bandla Ganesh: పూరి అన్నా డైలాగ్ చెప్పడం రాని వాళ్ళను స్టార్స్ చేశావ్… కలకలం రేపుతున్న బండ్ల స్పీచ్!
[…] Also Read: Rama Rao On Duty Release Date Fix: డ్యూటీ ఎక్కడానికి సిద్ధ… […]