Anasuya In Bigg Boss 6: తెలుగు బుల్లితెర ద్వారా మంచి పాపులారిటీ మరియు క్రేజ్ ని సంపాదించి ఇప్పుడు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారిన నటి అనసూయ..ఒక్క పక్క బుల్లితెర మీద యాంకరింగ్ చేస్తూనే మరో పక్క క్రేజీ ప్రాజెక్ట్స్ తో పవర్ ఫుల్ రోల్స్ తో వెండితెర మీద కూడా ఒక్క వెలుగు వెలుగుతుంది..ఇప్పటి వరుకు ఈమె చేసిన సినిమాలలో రంగస్థలం, క్షణం మరియు పుష్ప సినిమాలు ఎంత పెద్ద సంచలన విజయాలుగా నమోదు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా రంగస్థలం లో పోషించిన రంగమ్మ అత్త పాత్ర, అలాగే పుష్ప సినిమాలో పోషించిన దాక్షాయణి పాత్ర ఆమెకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది..ఇంత క్రేజ్ మరియు పాపులారిటీ ని సంపాదించుకున్న అనసూయ ని త్వరలో మాటీవీ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీసన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయించేందుకు స్టార్ మా ఛానల్ చాలా కష్టపడుతోంది అట..ఈ రియాలిటీ షో ప్రారంభమైన మొదటి సీసన్ నుండే అనసూయ కోసం స్టార్ మా వారు చాలా గట్టిగానే ప్రయత్నిస్తూ వస్తున్నారు..కానీ అనసూయ స్టార్ మా వారి ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూ వస్తుంది.

Anasuya
అనసూయ బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చెయ్యడానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి..అనసూయ ఒక్క బిజీ ఆర్టిస్టు..ఆమె కాల్ షీట్స్ కోసం ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఎదురు చూస్తారు..అలాగే ప్రస్తుతం ఆమె చేతి నిండా ఎన్నో బుల్లితెర షోస్ కూడా ఉన్నాయి..వీటి అన్నిటి నుండి ఆమెకి వచ్చే డబ్బులు మనం ఊహించుకోలేము కూడా..అంత భారీ స్థాయిలో ఉంటుంది..అలాంటి ఆదాయం ని వదులుకొని బిగ్ బాస్ షో కి వస్తే అనసూయ చాలా తీవ్రంగా నష్టపోతోంది..అంతే కాకుండా కంటెస్టెంట్ గా వెళ్తే వచ్చే రెమ్యూనరేషన్ కూడా పెద్ద గొప్పగా ఏమి ఉండదు..ఆలా అని అనసుఁయ కొత్తగా పాపులారిటీ ని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు..తనకి ఏ మాత్రం కూడా ఉపయోగం లేనడు ఈ షో లో పాల్గొని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనే ఉద్దేశ్యం తో ఆమె ఉన్నట్టు సమాచారం..కానీ బిగ్ బాస్ టీం వారు ఇప్పటికి ఆమెకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు..ఆమె నో చెప్తూనే ఉంది..అయితే బిగ్ బాస్ టీం వారు అనసూయకి ఇప్పుడొక్క క్రేజీ ఆఫర్ ఇచ్చారు..బిగ్ బాస్ హౌస్ లో ఒక గెస్ట్ కంటెస్టెంట్ గా మూడు వారాల పాటు హౌస్ లో ఉంటే కోటి రూపాయిలు పారితోషికం ఇస్తామని ఇటీవలే ఆఫర్ చేశారట..మరి అనసూయ దీనికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి..ఇప్పటికే 5 సీసన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆరవ సీసన్ ని ఆగష్టు నెలలో ప్రారంభించుకోబోతున్నట్టు తెలుస్తుంది.

Bigg boss 6
Also Read: PK TRS: పీకే సర్వే లీక్.. టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?