Bandla Ganesh: బండ్ల గణేష్ ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన కామెంట్స్ తరచుగా వార్తలకు ఎక్కుతూ ఉంటాయి. తాజాగా చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ పెద్ద చర్చకు దారి తీసింది. ఈ స్పీచ్ లో బండ్ల గణేష్… డైలాగ్ కూడా చెప్పడం రాని వాళ్ళను స్టార్స్ చేశావ్, నీ కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదన్నాడు. దర్శకుడు పూరితో పవన్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ ఇలా చాలా మంది స్టార్స్ చిత్రాలు చేశారు. మరి వీరిలో ఎవరిని ఉద్దేశించి బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఆసక్తికరంగా మారింది.

Bandla Ganesh
బండ్ల గణేష్ ఏమన్నారంటే… ఎవరెవరినో స్టార్లను చేశావ్, డైలాగ్స్ రాని వారిని హీరోలుగా పెద్ద స్థాయిలో నిలబెట్టావు. నీ కొడుకును మాత్రం పట్టించుకోకుండా ఇలా వదిలేశావు.. కనీసం కొడుకు ఈవెంట్ కు కూడా రాకుండా ముంబయ్ లో కూర్చున్నావ్. మన జీవితంలోకి వ్యాంప్ క్యారెక్టర్స్ వస్తుంటాయి పోతుంటాయి. కుటుంబం మాత్రమే శాశ్వతం. నేను బ్రతికేది నా కుటుంబ కోసం, నా కొడుకుల కోసం, నా కోసం. మనం ఏం చేసినా బిడ్డల కోసమే. రేపు మనకు తలకొరివి పెట్టేది వాళ్లే.. మనం ఆస్తులు సంపాదించినా వాళ్ళ కోసమే. అప్పులు చేసినా తీర్చేది వాళ్లే అన్నా, అంటూ బండ్ల గణేష్ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: Mohan Babu Assets: మోహన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ తో చేసిన హీరోలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. పబ్లిక్ వేదికలపై బండ్ల గణేష్ స్పీచ్ ఇచ్చి చాలా కాలం అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన బండ్ల అందరికీ షాక్ ఇచ్చారు. కాగా పవన్ తో బండ్ల గణేష్ కి దూరం పెరిగినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు బండ్ల గణేష్ ఆడియో రికార్డు ఒకటి వైరల్ అయ్యింది. ఆ ఆడియోలో ఉంది తన వాయిస్ కాదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. ఈ సంఘటనే బండ్ల గణేష్ తో పవన్ విబేధాలకు కారణమైనట్లు వినికిడి.

Bandla Ganesh
ఇక ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ జూన్ 24న విడుదల కానుంది. గెహ్నా సిప్పీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ పూరి గత చిత్రం రొమాంటిక్ పర్వాలేదు అనిపించుకుంది. ఓ సాలిడ్ హిట్ కోసం ఆకాష్ చాలా ట్రై చేస్తున్నారు. చోర్ బజార్ తో ఆ కోరిక తీరుతుందేమో చూడాలి.
Also Read:Samantha Tweet: సమంతను వేశ్య అన్న నెటిజెన్… ఆమె షాకింగ్ రిప్లై!