Naga Chaithanya Thankyou Movie: అక్కినేని నాగచైతన్య మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్ర విజయాలతో దూకుడుమీదున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించే థ్యాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. సమంతతో విడాకులతో ఏకాకిగా మిగిలిన చైతు వరుస చిత్రాలు చేస్తూ తన కెరీర్ ను నిర్మించుకుంటున్నాడు. సినిమాయే లోకంగా ముందుకు సాగుతున్నాడు. విజయవంతమైన చిత్రాలు రావడంతో జోష్ పెంచుతున్నాడు. సినిమా నిర్మాణంలో వేగాన్ని అందుకుంటున్నాడు.

Nagachaithanya
థ్యాంక్యూ జులైలో వస్తోంది. ఆగస్టులో అమీర్ ఖాన్ తో చేసిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్యాంక్యూ కు విక్రమ్ కె. కుమార్ దర్శకుడు కావడంతో అబిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మాత కావడంతో చిత్రంపై ప్రేక్షకులకు ఇంకా ఆశలు ఎక్కువవుతున్నాయి. దీంతో సినిమా ప్రమోషన్స్ అదరగొట్టాల్సింది పోయి కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రేక్షకుల్లో కంగారు మొదలైంది దిల్ రాజు సినిమా గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Senior Hero Naresh: నేనేనా ఎవరూ మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేదా… ఫైనల్ గా నోరువిప్పిన నరేష్
థ్యాంక్యూ విడుదలకు రెండు వారాలు కూడా లేదు. ఇంతవరకు ప్రమోషన్లు మాత్రం చేపట్టడం లేదు. దీంతో అసలు సినిమా గురించి ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు సైతం వస్తున్నాయి. ఇప్పటికే రెండు పాటలను సోషల్ మీడియాలో పోస్టు చేసినా సరైన స్పందన రావడం లేదు. మేకర్స్ సరిగా చేయడం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో థ్యాంక్యూ చిత్ర నిర్మాణం విషయంలో దిల్ రాజు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నాడనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.

Nagachaithanya
విజయ్ హీరోగా వస్తున్న వారసుడు, శంకర్ రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలకు భారీ ఎత్తున ప్రమోషన్లు ఇస్తూ చైతు చిత్రానికి మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని అభిమానులు అడుగుతున్నారు. దిల్ రాజు కావాలనే థ్యాంక్యూ చిత్రాన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనిపై ఆయన ఏం సమాధానాలు చెబుతారో చూడాల్సిందే. మొత్తానికి థ్యాంక్యూ సినిమాపై దిల్ రాజు సీత కన్ను వేస్తున్నట్లు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర విజయానికి చర్యలు తీసుకోకపోవడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
Also Read:Mohan Babu Assets: మోహన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?