Ravi Teja and Pawan Kalyan : 1990లో విడుదలైన కర్తవ్యం మూవీలో చిన్న పాత్ర చేసిన రవితేజ, సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. అనంతరం సపోర్టింగ్, విలన్, కామెడీ రోల్స్ సైతం చేశారు. సోలో హీరోగా నీ కోసం మూవీతో ఛాన్స్ వచ్చింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన నీకోసం మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరలా కామెడీ, సెకండ్ హీరో పాత్రలు చేశాడు. పలు రకాల పాత్రలు చేస్తూనే హీరోగా ప్రయత్నాలు చేశాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తో హీరోగా మొదటి హిట్ పడింది. ఆ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకుడు.
ఆ వెంటనే దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీ చేశాడు. ఇది కూడా హిట్. అయితే రవితేజకు పెద్దగా ఇమేజ్ రాలేదు. హీరోగా విజయాలు దక్కినా, జనాల్లో రవితేజకు చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ మరోసారి హీరోగా రవితేజకు ఛాన్స్ ఇచ్చాడు. ఇడియట్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ డ్రామా తెరకెక్కించాడు. టైటిల్ తోనే ప్రేక్షకులను పూరి జగన్నాధ్ ఆలోచింపజేశాడు. నిజానికి ఇలాంటి నెగిటివ్ వైబ్ తో కూడిన తిట్లను టైటిల్స్ గా పెట్టరు. టైటిల్ అంటే హీరో వీరుడు శూరుడు అనే రేంజ్ లో ఉండాలి.
Also Read : పవన్ కళ్యాణ్ – రవితేజ కాంబినేషన్ లో మిస్ అయిన మణిరత్నం సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పూరి జగన్నాధ్ చాలా భిన్నంగా ఆలోచించి ఈ టైటిల్ పెట్టాడు. నిజానికి హీరో క్యారెక్టరైజేషన్ కి ఆ టైటిల్ సూట్ అయ్యింది. ఇడియట్ విడుదలై సూపర్ హిట్ టాక్. చంటిగాడిగా రవితేజ అద్భుతంగా నటించాడు. పూరి జగన్నాధ్ చంటిగాడు పాత్రను మలచిన తీరు, ఆయన రాసిన డైలాగ్స్ గట్టిగా పేలాయి. చక్రి మ్యూజిక్ సైతం సినిమాకు ప్లస్ అయ్యింది. మొత్తంగా ఇడియట్ మూవీ బ్లాక్ బస్టర్. రవితేజ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇడియట్ రవితేజను హీరోగా నిలబెట్టిన చిత్రం అనడంలో సందేహం లేదు.
అయితే ఈ కథను మొదటగా పూరి జగన్నాధ్ హీరో పవన్ కళ్యాణ్ కి వినిపించారు. అనుకోని కారణాలతో పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపలేదు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బద్రి సూపర్ హిట్. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పిన కథ పట్ల ఆసక్తి చూపలేదు. పవన్ కళ్యాణ్ నిర్ణయం రవితేజ ఫేట్ మార్చేసింది. స్టార్ హీరో కావడానికి కారణం అయ్యింది.
Also Read : పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేసి హిట్ కొట్టిన రవితేజ.. ఆ సినిమా ఏమిటో తెలుసా?