Ravi Teja- Pawan Kalyan: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ ద్వారా పాపులర్ అయ్యి, చిన్నగా హీరో అవకాశాలను సంపాదించి, నేడు మాస్ మహారాజ గా అశేష ప్రజాభిమానం పొంది, స్టార్ హీరో గా ఎదిగిన నటుడు రవితేజ.ఈయన కెరీర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ చిత్రాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా చెక్కు చెదిరిపోని మార్కెట్ ఆయనది, రూపాయి పబ్లిసిటీ లేకుండా కేవలం ఆయన పేరు మీద ఓపెనింగ్స్ తెచ్చే కెపాసిటీ కూడా ఉంది.అయితే రవితేజ నేడు ఈ స్థానం లో ఉండడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పొచ్చు.’ఇడియట్’ మరియు ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలు లేకుంటే రవితేజ నేడు ఈ స్థానం లో ఉండేవాడు కాదు. ఈ రెండు చిత్రాలు కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమాలే.
అంతే కాదు వరుస డిజాస్టర్స్ తో కొట్టుమిట్టాడుతున్న రవితేజ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చింది కూడా పవన్ కళ్యాణ్ సినిమానే.ఆ చిత్రం పేరే బాలు, ఈ సినిమా స్టోరీ లైన్ ని తీసుకొని డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజ తో ‘బలుపు’ సినిమా తీసి గ్రాండ్ హిట్ కొట్టాడు. బాలు సినిమా ఫ్లాష్ బ్యాక్ లో హీరో పెద్ద మాఫియా డాన్ కి సంబంధించిన వ్యక్తి, ఆ సమయం లో ఆయనకీ హీరోయిన్ పరిచయం అవుతుంది.
ఆ హీరోయిన్ వల్ల హీరో జీవితమే మారిపోతుంది, మాఫియా లింక్స్ వల్ల హీరోయిన్ చనిపోవడం తో, హీరో మాఫియా కి దూరంగా సిటీ లో మామూలు మనిషిలాగ బ్రతుకుతాడు.’బలుపు’ సినిమా స్టోరీ లైన్ కూడా అలాంటిదే, కానీ బాలు చిత్రం లో ముంబై బ్యాక్ డ్రాప్ ఉంటే, బలుపు చిత్రం లో వైజాగ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది.స్టోరీ లైన్ వేరు అయినా స్క్రీన్ ప్లే పూర్తిగా మార్చి డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలు సినిమాని ఫ్రీ మేక్ చేసాడనే చెప్పాలి.