Hit 3 : ఇటు హీరోగా అటు నిర్మాతగా రాణిస్తూ సత్తా చాటుతున్నాడు హీరో నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ఆయన నిర్మించిన కోర్ట్ సంచలన విజయం అందుకుంది. నానికి పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన కోర్ట్ మూవీ రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కోర్ట్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నాని, మరో వారంలో తాను నటించిన హిట్ 3 చిత్రాన్ని థియేటర్స్ లోకి తెస్తున్నాడు. హిట్ 3 చిత్రానికి సైతం నాని నిర్మాత కావడం విశేషం.
కెరీర్లో అత్యంత వైలెంట్ రోల్ చేశాడు నాని. ఎస్పీ అర్జున్ సర్కార్ గా నాని హిట్ 3లో కనిపించనున్నారు. హిట్ 3 ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్, నాని అగ్రెసివ్ అండ్ వైల్డ్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలెట్ కానున్నాయి. హిట్ 3 మూవీ మే 1న థియేటర్స్ లోకి రానుంది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. సెన్సార్ సభ్యులు హిట్ 3 చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే ఇది పెద్దలకు మాత్రమే చిత్రం. పిల్లలకు నో ఎంట్రీ. మితిమీరిన వైలెన్స్ రీత్యా హిట్ 3 చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చారు.
Also Read : హిట్ 3′ సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టలో తెలుసా..? నాని కి అగ్నిపరీక్ష!
అలాగే కొన్ని కట్స్ చెప్పారని తెలుస్తుంది. ఫౌల్ లాంగ్వేజ్ తో కూడిన డైలాగ్స్ కి కట్స్ చెప్పారట. ఇక సెన్సార్ సభ్యుల నుండి హిట్ 3 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్లు సమాచారం. హిట్ 3తో నాని మరో విజయం ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమెకు ఇది మొదటి చిత్రం. శైలేష్ కొలను తన సినిమాటిక్ యూనివర్స్ లో మూడో చిత్రంగా హిట్ 3 తెరకెక్కించాడు. గతంలో శైలేష్ కొలను హిట్, హిట్ 2 చిత్రాలు చేసి విజయాలు అందుకున్నారు. విశ్వక్ సేన్, అడివి శేష్ ఆ చిత్రాల్లో హీరోలుగా నటించారు.
హిట్ 3లో నానితో పాటు విశ్వక్ సేన్, అడివి శేష్ ఎంట్రీ కూడా ఉంటుందనే ప్రచారం నడుస్తుంది. హిట్ 3 చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.
Also Read : 24 గంటల్లో ‘హిట్ 3’ ట్రైలర్ భీభత్సం..అన్ని రికార్డ్స్ స్మాష్!
A for ARJUN SARKAAR
CERTIFIED. #HIT3 #HIT3FromMay1st pic.twitter.com/9PPKLwKEEJ
— Nani (@NameisNani) April 25, 2025