https://oktelugu.com/

హిట్ డైరెక్టర్ కి రిలీఫ్ ఇచ్చిన రవితేజ !

‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావుకి టైం అసలు బాగాలేదు. వరుసగా రెండు హిట్స్ ఇచ్చినా మరో సినిమా కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం అంటే… వెరీ బ్యాడ్ టైమే. అయితే నక్కిన నిరీక్షణకు ఫలితం దక్కింది. ఆయన దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ సినిమా మొదలుకానుంది. ఎప్పుడో సినిమా చేస్తున్నా అని రవితేజ చెప్పినా, ఇప్పటివరకూ డేట్స్ ఫిక్స్ చేయలేదు. కాగా తాజాగా రవితేజ నక్కిన సినిమాకి డేట్స్ ఇచ్చేశాడు. నిజానికి రవితేజ […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 04:09 PM IST
    Follow us on


    ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావుకి టైం అసలు బాగాలేదు. వరుసగా రెండు హిట్స్ ఇచ్చినా మరో సినిమా కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం అంటే… వెరీ బ్యాడ్ టైమే. అయితే నక్కిన నిరీక్షణకు ఫలితం దక్కింది. ఆయన దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ సినిమా మొదలుకానుంది. ఎప్పుడో సినిమా చేస్తున్నా అని రవితేజ చెప్పినా, ఇప్పటివరకూ డేట్స్ ఫిక్స్ చేయలేదు. కాగా తాజాగా రవితేజ నక్కిన సినిమాకి డేట్స్ ఇచ్చేశాడు. నిజానికి రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. క్రాక్ తరువాత రమేష్ వర్మ సినిమానే ముందు మొదలవుతుందని వార్తలు వచ్చాయి.

    Also Read: పక్కా ‘కమర్షియల్’ హిట్ ఇస్తాడంటా !

    అయితే రమేష్ వర్మ సినిమా కంటే కూడా త్రినాథరావ్ నక్కిన సినిమానే ముందు మొదలవుతుందని ఈ రోజు ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 5 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ కి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్న సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో రవితేజతో పాటు సత్యం రాజేష్, వెన్నెల కిషోర్ కూడా కనిపించనున్నారు. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్ లో మంచి టాక్ ఉంది.

    Also Read: స్పీడ్ పెంచేసిన ‘శ్యామ్‌ సింగ్ రాయ్’ !

    ఎలాగూ రవితేజ తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు కాబట్టి, నక్కిన కూడా కామెడీకి కేరాఫ్ కాబట్టి ఈ కలయిక పై భారీ అంచనాలు ఉన్నాయి. కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు. ఈ సారి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం కోసం నక్కిన టీమ్ పక్కా స్క్రిప్ట్ తో వస్తున్నారట. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొత్తానికి మాస్ మహరాజా రవితేజకి హిట్ లేకపోయినా ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ముందుకు పోతున్నాడు. అన్నట్టు రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏది ఏమైనా హిట్ డైరెక్టర్ నక్కినకు రవితేజ రిలీఫ్ ఇచిన్నట్టే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్