https://oktelugu.com/

తలొగ్గిన డొనాల్డ్ ట్రంప్.. అధికారం అప్పగింతకు అంగీకారం

అధికారం అప్పగింతకు ససేమిరా అంటూ నిన్న తన మద్దతుదారులను నిరసనలకు ఉసిగొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తలొగ్గాడు. కొత్త అధ్యక్షుడు జోబైడెన్ కు అధికారం అప్పగింతకు అంగీకరించాడు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఓటమిని అంగకీరించకుండా బెట్టు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఎట్టకేలకు మీడియాకు ముందు వచ్చి ఓటమిని అంగీకరించాడు. తదుపరి అధ్యక్షుడు బైడెన్ కు అధికారాన్ని అప్పగిస్తానని ప్రకటించాడు. Also Read: వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ..: మారణాయుధాలతో ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన అమెరికా 46వ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2021 / 04:18 PM IST
    Follow us on

    అధికారం అప్పగింతకు ససేమిరా అంటూ నిన్న తన మద్దతుదారులను నిరసనలకు ఉసిగొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తలొగ్గాడు. కొత్త అధ్యక్షుడు జోబైడెన్ కు అధికారం అప్పగింతకు అంగీకరించాడు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఓటమిని అంగకీరించకుండా బెట్టు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఎట్టకేలకు మీడియాకు ముందు వచ్చి ఓటమిని అంగీకరించాడు. తదుపరి అధ్యక్షుడు బైడెన్ కు అధికారాన్ని అప్పగిస్తానని ప్రకటించాడు.

    Also Read: వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ..: మారణాయుధాలతో ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన

    అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ ను ఆ దేశ పార్లమెంట్ ధ్రువీకరించిన కాసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో విభేదిస్తున్న సరే నిబంధనల ప్రకారం జనవరి 20న అధికార మార్పిడికి పూర్తిగా సహకరిస్తానని ట్రంప్ తెలిపారు. అయితే ఫలితాలపై మాత్రం మా పోరాటం కొనసాగుతుంది అని తెలిపారు. అయితే అధ్యక్ష చరిత్రలో ఇది నా మొదటి పర్యాయానికి ముగింపు.. తిరిగి తన పూర్వ వైభవం కోసం చేసే పోరాటానికి ఇది ఆరంభం అని ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. అంటే 2024లో మళ్లీ తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ట్రంప్ ఈ ప్రకటనతో హింట్ ఇచ్చాడు.

    జనవరి 20న జోబైడెన్ అధ్యక్షుడిగా.. కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయనున్నారు. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ కూడా వీరిద్దరిని గుర్తిస్తూ సహకరిస్తానని ప్రకటన విడుదల చేయడం విశేషం.

    Also Read: ట్రాక్టర్ల ర్యాలీతో కాక పుట్టించిన రైతులు

    అమెరికన్ పార్లమెంట్ సమావేశం వేళ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగడం.. అడ్డుకోవడం.. పోలీసులు కాల్పులకు దిగడం సంచలనమైంది. ఈ క్రమంలోనే జరిగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ క్రమంలోనే ట్రంప్ ను ఈ దాడులకు బాధ్యుడిగా అధ్యక్ష పదవి నుంచి దించే అవకాశాలపై కేబినెట్ చర్చలు జరుపుతున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు పేర్కొన్నారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు