Gandharva Movie: వంగవీటి, జార్జిరెడ్డి సినిమాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై… ఎం.ఎన్.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ సరసన… గాయత్రి, సురేష్, శీతల్ భట్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని… ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు అప్సర్ వెల్లడించారు. దర్శకుడిగా అప్సర్ కి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం… అలానే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు.
ఓ వైవిధ్యమైన రోల్‌లో హీరో సందీప్ మాధవ్ కనిపించనున్నారని మూవీ యూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని చిత్ర బృందం ప్రకటించారు. కాగా ఈరోజు హీరో సందీప్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా… ఫైట్ సీన్‌లో పాల్గొన్న 50 మంది ఫైటర్స్‌కు చిత్ర యూనిట్ సభ్యులు వెండి నాణాలను బహుకరించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు సాయి కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సందీప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకి ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. అలానే నిరంజన్ జె.రెడ్డి కెమెరామెన్ గా చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నాగు, ఎడిటర్ గా బస్వా పైడి రెడ్డి చేస్తుండగా… రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ సినిమాకి మరో హైలైట్ అని చెప్పాలి .