https://oktelugu.com/

Star Hero: హీరో అవ్వడానికి కష్టపడ్డాం, స్వాతంత్ర్యం కోసం కాదు కదా… ఆ స్టార్ హీరో కామెంట్స్ వైరల్…

బోయపాటి శ్రీను నుంచి బాబీ వరకు ఎంతో మందికి ఆయన అవకాశాలను ఇస్తూ వచ్చాడు. ఇక తను కష్టపడి హీరోగా ఎదిగిన విషయం మీద రవితేజ స్పందిస్తూ 'మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవడానికి కష్టపడ్డాం

Written By:
  • Gopi
  • , Updated On : February 21, 2024 / 12:39 PM IST
    Follow us on

    Star Hero: ఇండస్ట్రీలో ఒక నటుడు హీరోగా ఎదగడానికి చాలా రకాలుగా కష్టపడాల్సి ఉంటుంది. తిని, తినక పస్తులు ఉండి నిద్ర లేక, ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత వాళ్లు కోరుకున్న లైఫ్ వాళ్ళకి దక్కుతుందనే ఒకే ఒక్క నమ్మకంతో ముందడుగు వేస్తూ ఇండస్ట్రీలో నటులు కదులుతూ ఉంటారు అలాంటి వారిలో రవితేజ ఒకరు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆకాశాలు లేక చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకునేవాడు.

    ఆయన చేసిన ప్రతిపాత్ర కూడా ఆయనకి ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టింది. ఇక ఆ తర్వాత నిదానంగా హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా మారడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ హీరోలకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాగే చాలా మంది యంగ్ డైరెక్టర్లకి కూడా అవకాశాలను ఇస్తున్నాడు. ఇప్పుడున్న హీరోలలో రవితేజ ఒక్కడే చాలా మంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇక ఆయన ఇచ్చిన ఛాన్స్ వల్లే చాలామంది డైరెక్టర్లు వాళ్ల కెరియర్ ను సాఫీగా కొనసాగిస్తున్నారు.

    బోయపాటి శ్రీను నుంచి బాబీ వరకు ఎంతో మందికి ఆయన అవకాశాలను ఇస్తూ వచ్చాడు. ఇక తను కష్టపడి హీరోగా ఎదిగిన విషయం మీద రవితేజ స్పందిస్తూ ‘మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవడానికి కష్టపడ్డాం, దాంట్లో కష్టం ఏముంది మనం ఫ్రీడమ్ ఫైట్ చేసి స్వాతంత్ర్యం అయితే సంపాదించి ఇవ్వలేదు కదా’… మన కెరీర్ ని సెట్ చేసుకోవడానికి మాత్రమే మనం కష్టపడ్డాం. ఇది పెద్ద కష్టం కూడా కాదు అందుకే నేనెప్పుడూ నేను పడిన కష్టం గురించి చెప్పుకోను అంటూ ఒక ఇంటర్వ్యూలో రవితేజ చెప్పాడు. ఇక ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

    ఇక ఇది చూసిన చాలామంది రవితేజ చెప్పిన మాటల్లో నిజం ఉంది. మన కెరీయర్ ని మనం చక్కబెట్టుకోవడానికి కష్టపడుతున్నాం. పక్క వాళ్ళ కెరియర్ కోసమైతే కష్టపడటం లేదు కదా అంటూ వాళ్లు కూడా రవితేజ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు…