https://oktelugu.com/

Gopichand: గోపిచంద్ ముక్కు కోసిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

గోపీచంద్ వాళ్ళ నాన్న ఆయన టి కృష్ణ ఒకప్పుడు మంచి సినిమాలు చేసి టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన సినిమాల్లో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా కనిపించేవి.

Written By: , Updated On : February 21, 2024 / 12:27 PM IST
Do you know the director who cut Gopichand nose
Follow us on

Gopichand: సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే హీరో గోపీచంద్ కూడా తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ మాస్ హీరోగా తనని తాను రిప్రజెంట్ చేసుకుంటూనే ముందుకు కదులుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన స్టార్ హీరో రేంజ్ లో కొనసాగేవాడు, కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడం వల్ల స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోలేకపోయాడు. దానివల్ల మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే గోపీచంద్ వాళ్ళ నాన్న ఆయన టి కృష్ణ ఒకప్పుడు మంచి సినిమాలు చేసి టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన సినిమాల్లో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా కనిపించేవి. ఇక ఇదిలా ఉంటే గోపీచంద్ వాళ్ళ అన్నయ్య ఆయన ప్రేమ్ చంద్ ముత్యాల సుబ్బయ్య దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు. తను కూడా డైరెక్టర్ గా మారే క్రమంలోనే కార్ యాక్సిడెంట్ అయి చనిపోవడం అనేది వాళ్ల ఫ్యామిలీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి.

అయితే గోపీచంద్ వాళ్ళ అన్నయ్య తో కలిసి చిన్నప్పుడు ఆడుకునే సమయంలో ఆటలో భాగంగానే ప్రేమ్ చంద్ గోపీచంద్ ముక్కుకోసాడట. అందుకే గోపీచంద్ ముక్కు కొంచెం ముందుకు వాలినట్టుగా ఉంటుందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మొత్తానికైతే ఒక స్టార్ డైరెక్టర్ అవ్వాల్సిన వ్యక్తి అనంత లోకాలకు వెళ్లిపోవడం అనేది గోపీచంద్ ను చాలా బాధ పెట్టిందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే వాళ్ల నాన్న పేరు నిలబెట్టాలనే ఉద్దేశ్యం తోనే గోపిచంద్ సినిమా ఇండస్ట్రీ లో హీరోగా ఎదగాలని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు…

ఇక ప్రస్తుతం ఈయన ‘భీమా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే గోపిచంద్ మార్కెట్ భారీగా పెరుగుతుంది అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి…ఇక దీంతో పాటు గా యూవీ క్రియేషన్స్ లో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు…