Pregnant Woman: గర్భిణీ మహిళలు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. సరైన ఆహారం తీసుకుంటే మాత్రమే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీ మహిళలు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. గర్భిణీ మహిళలు పాల ఉత్పత్తులు, మాంసంతో పాటు కూరగాయలు, పప్పులు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
పెద్దలు గర్భంతో ఉన్న సమయంలో చేపలు తినకూడదని చెబుతుంటారు. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో కొన్ని రకాల చేపలకు దూరంగా ఉండాలి. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో పాదరసం ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండాలి. పాదరసం ఎక్కువగా ఉండే చేపలు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావని గుర్తుంచుకోవాలి. సముద్రం చేపలలో పాదరసం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
Also Read: గౌతం రెడ్డి హఠాన్మరణం: యువతలో గుండెపోటుకు కారణాలేంటి?
అలా కాకుండా సరస్సులు, చెరువులలో పెంచిన చేపలు మాత్రం ఎలాంటి సందేహం అవసరం లేకుండా తినవచ్చు. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పాలు, పాల పదార్థాలతో పాటు మహిళలు ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, పచ్చి గుడ్లకు మహిళలు దూరంగా ఉండాలి.
ప్రొసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్, రిఫైన్డ్ పిండికి కూడా దూరంగా ఉంటే మహిళల ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. ఎలర్జీ ఆహార పదార్థాలు, బొప్పాయిలతో పాటు ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు సైతం మహిళలు దూరంగా ఉండాలి.
Also Read: మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?
Recommended Video: