Mass Maharaja Raviteja
Raviteja : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన నటుడు మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎదో ఒకటి సాధించాలి అనే తపన ఉండే కొత్త వాళ్లకు రవితేజ ఒక ఆదర్శం. ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ, వాళ్ళని స్టార్ రేంజ్ కి తీసుకొచ్చిన ఘనత ఆయనది. అయితే ఇప్పుడు ఆ కొత్త డైరెక్టర్స్ కారణంగానే రవితేజ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. ఆయన గత మూడు చిత్రాలు ఏ రేంజ్ ఫ్లాప్స్ అంటే ఆయన మార్కెట్ మొత్తం నాశనం అయ్యే రేంజ్ ఫ్లాప్స్ అన్నమాట. డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ఒకప్పుడు రవితేజ సినిమాలకు భారీగా ఉండేవి. ఇప్పుడు ఆయన సినిమాలను ఫ్యాన్సీ రేట్స్ కి కొనుగోలు చేసేవాళ్ళే లేరు. అలాంటి స్థితికి వచేసాడు. కానీ ఒక్క భారీ హిట్ తగిలితే కచ్చితంగా ఆయన మార్కెట్ తిరిగి వచ్చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ లో ‘మాస్ జాతర(Mass Jathara)’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా భాను భోగవరపు అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ షాట్ లోనూ సూపర్ హిట్ కల కనిపించింది. వింటేజ్ రవితేజ ని చూపించబోతున్నాం అనే సందేశం ఈ గ్లిమ్స్ ద్వారా జనాలకు వెళ్ళింది. అంతా బాగానే ఉంది కానీ, రవితేజ రీసెంట్ లుక్స్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అసలే సన్నంగా ఉండే రవితేజ, ఇప్పుడు మరింత పేలవంగా తయారై కనిపించాడు. ఆయన ముఖంలో గ్లో మొత్తం పోయింది. అసలు ఈయన రవితేజనేనా అనే సందేహం అభిమానులకు కూడా కలిగింది. అంతలా మారిపోయాడు ఆయన.
ఇది కొత్త సినిమాకి సంబంధించిన గెటపా..?, లేకపోతే ఆరోగ్యం బాగలేక రవితేజ అలా మారిపోయాడా?, అసలు ఏమైంది అంటూ అభిమానులు భయపడుతున్నారు. ఆయన రీసెంట్ లుక్స్ ఎందుకు అలా ఉన్నాయి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రవితేజ కి పీఆర్ టీం లేకపోవడం వల్ల అభిమానులు కంగారుకి సమాధానం రావట్లేదు. అసలు ఇది ఇప్పటి ఫోతోనేనా?, లేకపోతే పాతదా?, షూటింగ్ సమయంలో రవితేజ కి దెబ్బలు బాగా తగులుతుంటాయి, అలా ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో తీసిన ఫోటోనా? అని అభిమానులు సందేహిస్తున్నారు. ఏది ఏమైనా రవితేజ లేటెస్ట్ లుక్ అభిమానులకు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ఇకపోతే ‘మాస్ జాతర’ చిత్రం సమ్మర్ కానుకగా మన ముందుకు రాబోతుంది. వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రంపై క్రేజ్ మరింత పెరిగింది. ‘ధమాకా’ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ తో కలిసి నటిస్తున్న చిత్రమిది.