https://oktelugu.com/

Ravi Teja Injury: గాయాలతో నిండిపోయిన రవితేజ శరీరం..ఫ్యాన్స్ కి వణుకు పుట్టిస్తున్న ఫోటోలు..స్పందించిన టీం!

రవితేజ రీసెంట్ గానే మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇప్పుడు ఆయన 75 వ సినిమాని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 23, 2024 / 07:49 PM IST

    Ravi Teja Injury

    Follow us on

    Ravi Teja Injury: నిరంతరం పని తప్ప క్షణం ఖాళీగా ఉండేందుకు ఇష్టపడని హీరోలలో ఒకరు మాస్ మహారాజ రవితేజ. సినిమా వాతావరణంలో లేకపోతే ఈయనకి అసలు బుర్ర పనిచేయదు అని చెప్పొచ్చు. సినిమా అంటే ఆయనకీ అంత పిచ్చి. అలా పని చేస్తున్న క్రమం లో ఆయనకీ అనేక సార్లు గాయాలు కూడా అయ్యాయి. కానీ ఏమాత్రం లెక్క చెయ్యడు. ఎంత పెద్ద గాయమైనా సరే ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని పక్క రోజే షూటింగ్ కి వచ్చేస్తూ ఉంటాడు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అయితే రవితేజ ప్రస్తుతం తన 75 వ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. కొద్దిరోజుల ముందే ఈ షూటింగ్ లో ఆయనకీ గాయాలు అయ్యాయి. అయితే వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆయన షూటింగ్ విశ్రాంతి లేకుండా చెయ్యడంతో ఆ గాయాలు పెరిగి పెద్దవి అయ్యాయి. దీంతో నేడు ఆయనకీ యశోద హాస్పిటల్స్ లో శస్త్ర చికిత్స చెయ్యాల్సి వచ్చింది. రవితేజ కి ఎలాంటి తీవ్రమైన గాయాలు అవ్వలేదని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఒక ఆరు వారాలు విశ్రాంతి తీసుకుంటే మాములు స్థితికి వచేస్తాడని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు.

    అయితే కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో లీకైన ఒక ఫోటో అభిమానుల వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. ఆక్సిజన్ పైపు ముక్కుకి తగిలించుకొని, ఛాతి మీద అనేక వైర్లతో కనిపించిన ఆయన ఫోటో ని చూసి ఇంత పెద్ద గాయమైందా, ఎదో చిన్న గాయాలు అనుకున్నామే అని సోషల్ మీడియా లో అభిమానులు బాధపడుతూ ట్వీట్లు వేశారు. దీనిపై వెంటనే స్పందించిన టీం, అది నిజమైన ఫోటో కాదని, రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ చిత్రానికి సంబంధించిన ఫోటో అని, దయచేసి ఆవేశం తో లేనిపోని ప్రచారాలు చేసి అభిమానులను కంగారు పెట్టొద్దు అంటూ కొన్ని మీడియా చానెల్స్ కి రిక్వెస్ట్ చేసారు. రవితేజ కి అంత పెద్ద గాయాలు ఏమి అవ్వలేదని, కేవలం తగిలిన చిన్న గాయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినందుకే అది పెద్దది అయ్యింది అని మరోసారి వివరంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో రవితేజ అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు.

    ఇకపోతే రవితేజ రీసెంట్ గానే మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇప్పుడు ఆయన 75 వ సినిమాని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాడు. అసలే వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం అవసరామా అంటూ సోషల్ మీడియాలో రవితేజ అభిమానులు అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ధమాకా చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.