Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టనున్న ఆ ముగ్గురు హీరోయిన్స్… చూసేందుకు రెండు కళ్ళు చాలవేమో!

కొన్ని నెలల ముందే సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8పై ఫుల్ బజ్ క్రియేట్ అయింది. బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అటువంటిది. బుల్లితెర ఆడియన్స్ లో బిగ్ బాస్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సీజన్ 7 సూపర్ హిట్ అయింది.

Written By: S Reddy, Updated On : August 23, 2024 7:33 pm

Bigg Boss 8 Telugu(1)

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో బీబీ లవర్స్ ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళని మరింత ఖుషి చేసే న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈసారి బిగ్ బాస్ 8 లో ముగ్గురు అందమైన కన్నడ భామలు అడుగు పెట్టబోతున్నారట. ఇక హౌస్ లో గ్లామర్ కు కొదవే ఉండదు. బిగ్ బాస్ ప్రేక్షకులకు పండగే అంటున్నారు. ఇంతకు ఆ ముగ్గురు కన్నడ నటీమణులు ఎవరు? ఆ వివరాలేంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని నెలల ముందే సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8పై ఫుల్ బజ్ క్రియేట్ అయింది. బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అటువంటిది. బుల్లితెర ఆడియన్స్ లో బిగ్ బాస్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సీజన్ 7 సూపర్ హిట్ అయింది. అత్యధిక రేటింగ్ తో నంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో సీజన్ 8 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సరికొత్త హంగులతో సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అతి ముఖ్యమైన కంటెస్టెంట్స్ ఎంపిక, ఫైనల్ ఇంటర్వ్యూలు పూర్తి చేస్తున్నారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం ముగ్గురు కన్నడ సీరియల్ హీరోయిన్స్ ని హౌస్ లోకి పంపుతున్నారట.

వారిలో ఒకరు సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ. బిగ్ బాస్ 8కి ఆమె ఎంపికైయ్యారట. తేజస్విని గౌడ కన్నడ నటి. కన్నడలో చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగు సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది.

అమర్ దీప్ ని ప్రేమ వివాహం చేసుకుంది. తేజు సీజన్ 8లో కంటెస్ట్ చేయబోతోందని తెలుస్తుంది. అలాగే మరో కన్నడ బ్యూటీ సౌమ్య రావు బిగ్ బాస్ 8కి ఎంపికైందట. సౌమ్య రావు కన్నడ నటి ఇంకా యాంకర్. జబర్దస్త్ యాంకర్ గా కొంతకాలం పని చేసింది. తెలుగు సరిగా రాకపోవడం ఆమెకు మైనస్ అయింది. జబర్దస్త్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో చేస్తుంది. త్వరలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యాష్మి గౌడ సైతం బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టనుందట. యాష్మి గౌడ కూడా కన్నడ సీరియల్ హీరోయిన్. తెలుగులో కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో యాష్మి గౌడ నెగిటివ్ రోల్ లో మెప్పిస్తుంది. ఈ ముగ్గురు కన్నడ భామలు అందంలో ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ఉంటారు. ఈ లెక్కన బిగ్ బాస్ 8లో గ్లామర్ కి కొదవ ఉండదు అంటున్నారు.

అలాగే యాంకర్ రీతూ చౌదరి, విష్ణు ప్రియ, బంచిక్ బబ్లు, సోనియా సింగ్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, అక్షిత, నటి సన, మోడల్ ఊర్మిళ చౌహాన్ వంటి సెలబ్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ లిస్ట్ లో ఎవరు హౌస్ లోకి వస్తారు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.