Ravi Teja: చాలా మంది హీరోలు మంచి కథలు అయినప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) విషయంలో ఇలాంటివి ఎక్కువ జరిగాయి. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు రవితేజ(Mass Maharaja Raviteja) కి బాగా ఉపయోగపడ్డాడు. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి చిత్రాలు ముందుగా పవన్ కళ్యాణ్ చేయాల్సినవే, ఎందుకో ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత ఇవి రవితేజ వద్దకు వెళ్లాయి, సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలా అల్లు అర్జున్(Icon Star Allu Arjun), ఎన్టీఆర్(Junior NTR) రిజెక్ట్ చేసిన ఒక కథ ని కూడా రవితేజ రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరోజుల్లో ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాని కూడా డామినేట్ చేసింది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాగా ఆల్ టైం క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకుంది ఆ చిత్రం.
ఆ సినిమా మరేదో కాదు, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం లో తెరకెక్కిన ‘భద్ర'(Bhadra Movie). బోయపాటి శ్రీను భవిష్యత్తులో ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టే సినిమాలు ఎన్నైనా తీయొచ్చు. కానీ ఆయన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ది బెస్ట్ సినిమా ఏది అని లెక్కలేసుకుంటే భద్ర సినిమానే ఉంటుంది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, లవ్, సాంగ్స్ ఇలా అన్ని విభాగాల్లో ఈ చిత్రం తోపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ కి వినిపించారు. ఇలాంటి లవ్ స్టోరీ కథలు మనకి సూట్ అవ్వవులే అని ఆయన రిజెక్ట్ చేసాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ కి వెళ్లి చెప్పాడు. ఆయనకు కథ అద్భుతంగా నచ్చింది. కానీ అప్పటికే వేరే సినిమాకు కమిట్ అయిపోయి ఉన్నాడు. కానీ కథ బాగా నచ్చడంతో తన కారులో బోయపాటి శ్రీను ని కుర్చోబెట్టుకొని దిల్ రాజు ఆఫీస్ కి తీసుకెళ్లాడు.
రాజు గారికి మీ దగ్గర ఒక మంచి కథ ఉందని చెప్పాను, మీరు వెళ్లి ఆయనకు స్టోరీ ని వినిపించండి అని చెప్పి బోయపాటి శ్రీను ని దిల్ రాజు వద్దకు వెళ్ళాడట. దిల్ రాజు కి కథ తెగ నచ్చేసింది. ఆ తర్వాత రవితేజ కి ఈ స్టోరీ ని వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెప్పి ఈ సినిమా సినిమా చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. అలా ఎన్టీఆర్, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ సినిమా రవితేజ చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు. అయితే ఈ చిత్రం చూసిన తర్వాత ఇది రవితేజ కి తప్ప మరో హీరో కి సెట్ అవ్వదు అనేలా ఉంది. ఒకవేళ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీరిలో ఎవరో ఒకరు ఒప్పుకొని ఈ సినిమా చేసినా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అని విశ్లేషకులు చెప్తున్నారు.