Balakrishna: పెహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి తర్వాత మన దేశంలో చోటు చేసుకుంటున్న సంఘటనలను గత కొద్దిరోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. భారత్ పాకిస్థాన్ కి ముచ్చమటలు పట్టించిన ఘటన యావత్తు ప్రపంచం మొత్తం చూసింది. భారత్ కి ఇంత బలం ఉందా, ఇంత టెక్నాలజీ ఉందా, చైనా, అమెరికా నుండి ఎగుమతి చేయబడిన మిస్సైల్స్ ని మన సైనికులు గాల్లో దీపావళి టపాకాయలు లాగా పేల్చేస్తుండడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి పాకిస్తాన్ అణుబాంబులు నిల్వ చేసిన స్థావరాన్ని గుర్తించి, అక్కడికి బ్రహ్మోస్ మిస్సైల్ వదలబోతున్న సమయం లో పాకిస్తాన్ కాళ్ళ భేరానికి వచ్చి, అమెరికా ని బ్రతిమిలాడి, ఇండియా తో మాట్లాడించి సీజ్ ఫైర్ చేశారు. నేడు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల సంగతి నేడు రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి చెప్పనున్నాడు.
ఇదంతా పక్కన పెడితే మన భారత జవాన్స్ కి ఎన్ని సార్లు సెల్యూట్ చేసిన తక్కువే, వాళ్ళు లేకపోతే ఈరోజు సగం దేశం లేచిపోయేది, ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పొయ్యేవి. అలాంటివి ఏమి జరగకుండా, 24 గంటలు సరిహద్దుల్లో పోరాడుతూ పలువురు జవాన్లు ప్రాణాలను విడిచారు. వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్(Murali Nayak) కూడా ఉన్నాడు. పట్టుమని 23 ఏళ్ళ వయస్సు కూడా లేని ఈ కుర్రాడు, ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న అతి తక్కువ సమయంలోనే విధుల్లోకి అడుగుపెట్టాడు. మొదటి ఆపరేషన్ లోనే పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెడుతూ, తన ప్రాణాలను కూడా కోల్పోయాడు. ఇంత చిన్న వయస్సులో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ ని చూస్తే ఎలాంటి వాడికైనా కన్నీళ్లు రాక తప్పదు. నిన్న మురళీ నాయక్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), హోమ్ మినిస్టర్ అనిత తదితరులు పాల్గొని కన్నీటితో నివాళి అర్పించారు.
ప్రభుత్వం తరుపున 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం, 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకోవడానికి 300 గజాల స్థలం తో పాటు, మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. వీటితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపుగా పాతిక లక్షల రూపాయిల విరాళం కూడా అందించాడు. భవిష్యత్తులో ఏ చిన్న కష్టమొచ్చినా మా మూడు పార్టీలు కూటమికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా మురళీ నాయక్ కి తన గొప్ప మనసుని చాటుతూ విరాళం అందించాడు. హిందూపూర్ ఎమ్మెల్యే గా తాను తీసుకుంటున్న జీతాన్ని మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఇది కేవలం ఒక్క నెల జీతమా?, లేకపోతే ప్రతీ నెల తనకు వచ్చే జీతాన్ని దానం చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.