https://oktelugu.com/

Unstoppable With NBK: బాలయ్య అన్​స్టాపబుల్​ షోకు గెస్ట్​గా మాస్​ మహారాజ్​?

Unstoppable With NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు మరో వైపు ఓటీటీ లో సందడి చేస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అటు వెండితెరపై తన నటనతోనే కాకుండా… ఓటీటీలోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 01:31 PM IST
    Follow us on

    Unstoppable With NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు మరో వైపు ఓటీటీ లో సందడి చేస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అటు వెండితెరపై తన నటనతోనే కాకుండా… ఓటీటీలోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య.

    ravi-teja-and-gopichand-malineni-to-feature-in-nandamuri-balakrishna-unstoppable-show

    ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో ప్రముఖ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో ప్రశ్నలను సందిస్తూ.. గేమ్స్‏తో బాలకృష్ణ చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ షోకు మంచు మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, శ్రీకాంత్, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు వచ్చి సందడి చేశారు.

    Also Read: అఖండ 15 రోజుల కలెక్షన్స్.. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి ఇలా..

    అలాగే త్వరలో మహేశ్​ బాబు, రాజమౌళి, కీకరవాణికి సంబంధించిన ఎపిసోడ్స్​ను ప్రసారం చేయనున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో స్టార్​ను గెస్ట్​గా పిలిచేందుకు బాలయ్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. రవితేజతో పాటు దర్శకుడు గోపిచంద్ మలినేని కూడా ఈ షోలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సంభాషణ క్రేజీగా సాగనుందని టాక్ నడుస్తోంది. మరి బాలయ్య షోకు రవితేజా రావడంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

    ఇటీవలే అఖండ సినిమాలో భారీ హిట్ కొట్టిన బాలయ్య.. ప్రస్తుతం అనిల్​ రావిపుడి దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు. మరోవైపు రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్​డ్యూటి వంటి చిత్రాల్లో షూటింగ్​ల్లో ఫుల్ బిజీగా ఉన్నరు.

    Also Read: ఆ ముగ్గురు స్టార్స్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన 2021