https://oktelugu.com/

Pushpa: అక్కడ సరైన ప్రమోషన్స్​ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు​ తగ్గలేదుగా?

Pushpa: ‘అలవైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సీఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. సుక్కు- బన్నీ కాంబోలో తొలి పాన్​ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్​ చేస్తూ వచ్చింది. మరోవైపు రకరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్​కు వస్తున్న భారీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 01:42 PM IST
    Follow us on

    Pushpa: ‘అలవైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సీఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. సుక్కు- బన్నీ కాంబోలో తొలి పాన్​ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్​ చేస్తూ వచ్చింది. మరోవైపు రకరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్​కు వస్తున్న భారీ బడ్టెట్ సినిమా కావడంతో.. ఎలా ఉంటుందో అని ఊహలు పెంచుకున్నారు ప్రేక్షకులు.

    Pushpa

    Also Read: 2021లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలివే..!

    అయితే అనుకున్న స్థాయిలోనే తొలి రోజు భారీ వసూళ్లను కొల్లగొడుతూ రికార్డులు సృష్టించింది పుష్ప(Pushpa). ఈ సినిమా 5 భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అందులో హిందీ కూడా ఒకటి. అయితే, ఈ సినిమా హిందీ వర్షన్ వసూళ్లపై మొదటి నుంచి డైట్​గానే ఉండేది. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్​ తక్కువ కావడం.. దానికి తోడు ఈ సినిమాపై వివాదం తలెత్తడం.. ఇవన్నీ పుష్పను అడ్డుకుంటాయేమో అని అందరూ భయపడుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో బన్నీ, ప్రేక్షకులను థియేటర్​కు రప్పించగలడా అని అందరూ అనుకున్నారు.

    అయితే, బన్నీ దానికి కలెక్షన్ల రూపంలో సమాధానం చెప్పాడు. బాలీవుడ్​లోనూ తొలిరోజు 3.1 కోట్ల వసూళ్లు చేసింది పుష్ప. సరైన ప్రమోషన్స్​ లేకున్నా కూడా.. మంచి ఫిర్​ రాబట్టి సత్తా చాటింది. ఇక రానున్న వారంలో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్​కు ఏమేరకు రప్పిస్తుందో చూడాలి.

    Also Read: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్​కు​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడో తెలుసా?