Congress Leaders: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరు సాగించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాలతో రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ని అమేథీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాదయాత్ర చేపడుతున్నారు. వారికి మద్దతుగా మన రాష్ర్టంలో కూడా కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారికి సంఘీభావంగా ఆందోళన చేసేందుకు పాదయాత్ర చేపట్టడంత కాంగ్రెస్ శ్రేణులు కూడా కదులుతున్నారు. ప్రభుత్వాల విధానాలు ఎండగట్టేందుకు ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది.
చేవెళ్లలో పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి, ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సంగారెడ్డిలో కార్యనిర్వహణ అధ్యక్షుడు జగ్గారెడ్డి సిద్ధమయ్యారు. దీనికి కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నేతలు ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Inter Examinations: ఇంటర్ పరీక్షల్లో ‘ఫెయిల్’ అయిందెవరు?
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. జనవరి 30 నుంచి 15 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది. 2022 ఫిబ్రవరి మొదటి వారంలో రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో అధిష్టానం దృష్టి సారించినట్లు స్ఫష్టమవుతోంది.
Also Read: TRS: బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పక్కా ప్లాన్?