Waltair Veerayya : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ధమాకా మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు..భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది..క్రాక్ తర్వాత వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన రవితేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ హిట్ కొడతాడని ఎవ్వరు ఊహించలేకపోయారు..ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందు దూసుకుపోతుంది.

ఈ సంగతి అలా కాసేపు పక్కన పెడితే రవితేజ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ సినిమాలో ఆయన పాత్ర నిడివి దాదాపుగా 40 నిమిషాల వరకు ఉంటుంది..చిరంజీవి కి తమ్ముడిగా విక్రమార్కుడు తరహాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ని ఇందులో ఆయన చేసాడు..ఆయన పాత్ర కి సమందించిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ పాత్ర కోసం రవితేజ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది..మైత్రీ మూవీ మేకర్స్ ముందుగా ఈ చిత్రం కథని రవితేజ కి చెప్పగా ఆయన వెంటనే ఓకే చెప్పాడు కానీ , 17 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసాడట..ఎందుకంటే తాను ఒప్పుకున్న సినిమాల డేట్స్ ని పక్కన పెట్టి ఈ చిత్రానికి సర్దుబాటు చెయ్యాలి..అందుకే ఆయన అంత మొత్తం లో డిమాండ్ చేసాడట..మాములుగా రవితేజ ఒక్కో సినిమాకి పది కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు..ఈ సినిమా కోసం మరో 7 కోట్లు అదనంగా డిమాండ్ చేసాడు..కానీ మైత్రీ మూవీ మేకర్స్ 16 కోట్ల రూపాయలకు డీల్ ముగించారట.
ఈ సినిమాలో రవితేజ పాత్ర మెగాస్టార్ చిరంజీవి తో సమానంగా ఉంటుంది..ప్రారంభం లో ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంటుందట..తర్వాత మళ్ళీ కలిసిపోతారట..చిరంజీవి మరియు రవితేజ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని టాక్..జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.