Khushi Re Release- Akira Nandan: న్యూ ఇయర్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పవన్ మూవీ అంటే అది ఏదైనా? ఎప్పటిదైనా? అభిమానులు ఎగబడి చూస్తారని రుజువైంది. ఖుషి రీరీలీజ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రీరీలీజ్ లో పవన్ మూవీ మరో రికార్డ్ సెట్ చేసింది. పవన్ బర్త్ సందర్భంగా జల్సా మూవీ విడుదల చేయగా ఇదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే రోజు విడుదలైన తమ్ముడు చిత్రాన్ని కూడా పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.

2001 ఏప్రిల్ 26న విడుదలైన ఖుషి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ ఇమేజ్ ని ఈ మూవీ ఎవరెస్ట్ కి చేర్చింది. లవ్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ కలగలిపి ఫుల్ మీల్ లాంటి సినిమాను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడు ఎస్ జె సూర్య ఖుషి మూవీతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఎస్ జె సూర్యకు ఈ రేంజ్ హిట్ మరలా పడలేదు. ఎ ఎం రత్నం ఖుషి చిత్రాన్ని నిర్మించారు. ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. పవన్ ప్రెజెన్స్, భూమిక గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ సినిమాను అద్భుతంగా మలిచాయి.
కాగా ఖుషి చిత్రాన్ని పవన్ కుమారుడు అకీరా నందన్ థియేటర్లో చూశాడు. మిత్రులతో పాటు ఖుషి ఆడుతున్న థియేటర్ కి అకీరా వచ్చాడు. పింక్ కలర్ హోడెడ్ టి షర్ట్ ధరించిన అకీరా మాస్క్ ధరించి తనను ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్రత్త పట్టాడు. పవన్ అభిమానుల మధ్య కూర్చొని అకిరా ఖుషి మూవీ చూసి ఎంజాయ్ చేశాడు. అకీరా ప్రస్తుత వయసు 18 ఏళ్లు కాగా… మ్యాన్లీ లుక్ లోకి వచ్చాడు. గడ్డం కూడా రావడంతో అకీరా హీరోగా సిద్దమయ్యాడు అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అకీరా మదర్ రేణూ దేశాయ్ ఆ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా చదువుకుంటున్నాడు. అతని ఆసక్తిని బట్టి కెరీర్ ఎంచుకుంటాడు అన్నారు. అయితే అకీరా మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, మ్యూజిక్ వంటి కళలు నేర్చుకుంటున్నాడని సమాచారం. కాగా రెండేళ్ల క్రితమే అకీరా ఆరున్నర అడుగులు ఉన్నాడు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ అందరికంటే హైట్. వరుణ్ రికార్డు అకిరా బ్రేక్ చేశాడు. మెగా ఫ్యామిలీలో అకీరా అందరి కంటే పొడగరి.