https://oktelugu.com/

Ravi Krishna – Navya Swami : ఏళ్ల తరబడి రొమాన్స్, ఫైనల్లీ నవ్య స్వామితో తన బంధం బహిర్గతం చేసిన రవికృష్ణ..!

పలుమార్లు నవ్య స్వామి మా ఇద్దరి మధ్య ఏమి లేదు కేవలం స్నేహితులం అని చెప్పుకొచ్చింది. కానీ నెటిజన్లు మాత్రం వాళ్ళ సంథింగ్ సంథింగ్ అంటుంటారు. అయితే తాజాగా రవికృష్ణ దీనిపై ఓపెన్ అయ్యాడు.

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2024 / 12:49 PM IST

    Ravi Krishna - Navya Swami

    Follow us on

    Ravi Krishna : నవ్య స్వామి-రవికృష్ణ బుల్లితెర సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరూ కలిసి నటించారు. పలు ఈవెంట్స్ లో జతకట్టి క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో నవ్య స్వామి-రవికృష్ణ మధ్య సంథింగ్ సంథింగ్ అనే ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ వార్తలపై నటుడు రవికృష్ణ స్వయంగా స్పందించాడు. స్పష్టత ఇచ్చాడు.

    సీరియల్ నటుడు రవికృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొగలిరేకులు సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలో ఎంట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సూపర్ హిట్ సీరియల్ లో దుర్గ పాత్రలో అద్భుతంగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, వరూధిని పరిణయం, మనసు మమత, బావ మరదలు, ఆమె కథ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించి బుల్లితెర పై స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై దృష్టి సారించి, సీరియల్స్ కి గుడ్ బై చెప్పాడు.

    ఇటీవల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. కాగా రవి కృష్ణ – నటి నవ్య స్వామి ప్రేమలో ఉన్నారని అప్పట్లో బాగా రూమర్స్ వినిపించాయి. పైగా వాళ్లిద్దరూ పలు ఈవెంట్స్ లో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడం, కలిసి కనిపించడంతో అవి మరింత ఎక్కువయ్యాయి. రష్మీ – సుధీర్ మాదిరిగా రవికృష్ణ – నవ్య లు లవ్ ట్రాక్ తో సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయ్యారు. అయితే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

    పలుమార్లు నవ్య స్వామి మా ఇద్దరి మధ్య ఏమి లేదు కేవలం స్నేహితులం అని చెప్పుకొచ్చింది. కానీ నెటిజన్లు మాత్రం వాళ్ళ సంథింగ్ సంథింగ్ అంటుంటారు. అయితే తాజాగా రవికృష్ణ దీనిపై ఓపెన్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చాడు. నవ్య స్వామి – రవికృష్ణ ఆమె కథ అనే సీరియల్ లో కలిసి నటించారు. మూడేళ్ళ పాటు ఈ సీరియల్ స్టార్ మా లో సక్సస్ ఫుల్ గా రన్ అయింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

    వాళ్ళు క్లోజ్ గా ఉండటం చూసి సోషల్ మీడియాలో ప్రేమ, పెళ్లి అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. పైగా బుల్లితెర షోలలో నవ్య స్వామి – రవికృష్ణ రీల్ కపుల్స్ గా నటించడంతో ఈ జంట బాగా హైలెట్ అయ్యారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉండటం వలన కలిసి కనిపించడం లేదు. కాగా రవికృష్ణ ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

    నవ్య స్వామి మీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ ప్రశ్నించారు. తను నా బెస్ట్ ఫ్రెండ్ అంతే అంతకంటే మా మధ్య ఏమీ లేదు. గతంలో నేను నవ్య చేసినవన్నీ కేవలం షో కోసమే. అవన్నీ స్కిట్స్ మాత్రమే. అందరూ అనుకుంటున్నట్లు మేము ప్రేమికులం కాదు. మా వరకు ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. కానీ చాలా మంది మా గురించి ఏవేవో అనుకున్నారు, అంటూ రవికృష్ణ చెప్పుకొచ్చాడు. కాగా రవికృష్ణ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నాడు. ట్రాన్స్ జెండర్ తమన్నా మనోడిని ఆడుకుంది. రవికృష్ణ హౌస్లో పర్లేదు అనిపించాడు. 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు.