https://oktelugu.com/

Double Smart’ movie : డబుల్ ఇస్మార్ట్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రానున్న పాన్ ఇండియా స్టార్ హీరో…

రామ్ పోతినేని ప్రస్తుతం పాన్ ఇండియా లో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే క్రమంలో బిజీ గా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలేవి కూడా ఆశించిన విజయాలను అందించడం లేదు. దాంతో మరోసారి తన సూపర్ హిట్ సినిమా అయిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమాని చేశాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 3, 2024 / 12:42 PM IST
    Follow us on

    Double Smart’ movie : సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే డేరింగ్ అండ్ డాషింగ్ గా నిర్ణయాలను తీసుకుంటు వాళ్ళ సినిమాలను తొందరగా చేస్తూ ప్రేక్షకుల్లో ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదిస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళలో పూరి జగన్నాథ్ ఒకరు. ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలను చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక తను ఇంతకుముందు విజయ్ దేవరకొండ తో చేసిన టైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో భారీగా దెబ్బతిన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు రామ్ పోతినేని తో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాను ఈనెల 15 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని వైజాగ్ లో రిలీజ్ చేస్తున్నారు.

    ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను చాలా అద్భుతంగా కట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక్కసారిగా ట్రైలర్ తో ఈ సినిమా మీద అంచనాలు పెంచేయాలనే ఉద్దేశ్యంలో పూరి జగన్నాథ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆగస్టు 15వ తేదీన చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటేనే జనాలు వీళ్ళ సినిమాలు చూడటానికి వస్తారు. ఇక లేకపోతే మాత్రం వీళ్ళ సినిమాలు చూసే జనాలు ఉండరు అనేది వాస్తవం… ఇప్పటికే రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పాటుగా విక్రమ్ ‘తంగలాన్’ సినిమాతో వస్తున్నాడు. మరి వీళ్లను కాదని పూరి జగన్నాథ్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా వచ్చింది. 2019 లో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించటమే కాకుండా రామ్ ను పాన్ ఇండియాలో స్టార్ హీరోగా నిలబెట్టింది…ఇక మొత్తానికైతే ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్ లోనే సినిమా రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా తొందర్లోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఈవెంట్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి.

    మరి దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా అనే విషయం అయితే తెలీదు గానీ పూరి జగన్నాథ్ ప్రభాస్ ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇక దానికి అనుగుణంగానే వీళ్ళ కాంబో లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి రెండు సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కి ఒక కొత్త మ్యానరిజాన్ని ఇచ్చిన పూరి జగన్నాథ్ పిలిస్తే ప్రభాస్ రావడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటాడు అనేది వాస్తవం… కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి కొంచెం బూస్టప్ తీసుకురావడానికి ప్రభాస్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని పూరి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక తను వచ్చి ఈ టీమ్ కి తన బెస్ట్ విషెస్ చెబుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…