https://oktelugu.com/

Bhavadeeyudu Bhagat Singh: ‘భవదీయుడు భగత్ సింగ్’ నుండి హరీష్ శంకర్ అవుట్..కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే మరోపక్క సినిమాలు చేసుకుంటున్న సంగతి మన మన అందరికి తెలిసిందే..2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలు విడుదలయ్యాయి..రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచాయి..ఈ రెండు సినిమాల తర్వాత పవన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 09:43 AM IST
    Follow us on

    Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే మరోపక్క సినిమాలు చేసుకుంటున్న సంగతి మన మన అందరికి తెలిసిందే..2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలు విడుదలయ్యాయి..రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచాయి..ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే 60 శాతం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది..అయితే గత రెండు నెలల నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది..సోషల్ మీడియా లో ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి ఎవరికీ తోచిన కథలు వాళ్ళు అల్లుకుంటున్నారు కానీ సరైన కారణం మాత్రం దొరకడం లేదు..కరోనా కారణంగా చాలా కాలం నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ అనంతరం రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది..పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక మేకింగ్ వీడియో ని కూడా విడుదల చేసారు..అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటె ఈపాటికి షూటింగ్ కూడా అయిపోయేది..కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చాడు అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు..ఆగష్టు నెలలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

    Pawan Kalyan, Harish Shankar

    హరిహర వీరమల్లు సినిమా తో పాటు బాగా ఆలస్యం అవుతున్న మరో పవన్ కళ్యాణ్ సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’..గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించబోయ్యే ఈ సినిమా ఇప్పటి వరుకు కనీసం పూజా కార్యక్రమాలకు కూడా నోచుకోలేదు..ఈ చిత్ర నిర్మాత నవీన్ గారు పవన్ కళ్యాణ్ కి భారీ లెవెల్ లో అడ్వాన్స్ ఇచ్చి దాదాపుగా 7 ఏళ్ళు కావొస్తుంది..కానీ ఇప్పటి వరుకు డేట్స్ సర్దుబాటు చెయ్యలేకున్నాడు పవన్ కళ్యాణ్..ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనే విషయం పై హరీష్ శంకర్ మరియు నవీన్ ఇదివరకే పవన్ కళ్యాణ్ ని చాలా సార్లు కలిశారు..అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఈ సినిమా నుండి డైరెక్టర్ హరీష్ శంకర్ తప్పుకున్నాడని తెలుస్తుంది.

    Also Read: Samantha- Koffee With Karan Show: అవకాశం వస్తే నాగ చైతన్య ని చంపేస్తాను – సమంత

    Pawan Kalyan

    దాదాపుగా రెండేళ్ల నుండి ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ ఇప్పటికే సమయం చేతులు దాటిపోవడం తో తన సినీ కెరీర్ రిస్క్ లో పడుతుంది అని భావించి భవదీయుడు నుండి తప్పుకొని హీరో రామ్ తో సినిమా సెట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అయితే పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ వద్ద మాత్రమే కాదు, #RRR నిర్మాత DVV దానయ్య వద్ద కూడా ఒక సినిమా చెయ్యడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు..అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మరియు DVV దానయ్య ఎంటర్టైన్మెంట్స్ రెండిటిని కలిపి ఒకే సినిమా చెయ్యడానికి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నాడట..2024 సార్వత్రిక ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం తో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది..ఎన్నికల ముందు ఇదే పవన్ కళ్యాణ్ ఆఖరి చిత్రం అని కూడా చెప్పొచ్చు..పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు..ఈ ఫీవర్ తగ్గగానే తన నిర్మాతలందరిని పిలిచి సినిమాలకు సంబంధించిన డేట్స్ ని సర్దుబాటు చేస్తాడని తెలుస్తుంది.

    Also Read:Sudigali Sudheer: జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్.. దుమ్ములేపున్న ప్రోమో

    Tags