Rashmika Mandanna Remuneration: నేషనల్ క్రష్ ‘రష్మిక మందన్నా’ భారీగా రెమ్యూనరేషన్ ను పెంచేసింది. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఏకంగా ఒక్కో సినిమాకి రూ.4 కోట్లు 30 లక్షలు డిమాండ్ చేస్తోంది. నిజానికి, పుష్ప సినిమా ముందు వరకు రష్మిక రూ.కోటి 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది. కానీ, పుష్ప హిట్ అవ్వడం, బాలీవుడ్ లో వరుసగా సినిమాలు రావడంతో అమ్మడు ఎక్కడా తగ్గడం లేదు.
అయినా ఇండస్ట్రీలో సింగిల్ హిట్ వస్తే.. లైఫ్ చాలా మారిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ల లైఫ్ ఓవర్ నైట్ లోనే చేంజ్ అయిపోతుంది. అయితే, ఒక్కోసారి ఒక్క హిట్ కూడా పడకపోయినా.. హీరోయిన్ లో మ్యాటర్ ఉంది అని టాక్ తెచ్చుకున్నా చాలు.. మూడు, నాలుగు సినిమాల ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. అయితే, నాలుగు ఆఫర్లు వచ్చే సరికి, తమకు ఎక్కడా లేని డిమాండ్ ఉందని అపోహ పడి.. ఇష్టం వచ్చినంత అడుగుతారు సదరు హీరోయిన్లు.
Also Read: krithi shetty- Nithin: నితిన్ పై ‘కృతి శెట్టి’ సంచలన కామెంట్స్.. నితిన్ అలాంటి వ్యక్తి అట
కోటి కావాలి, అవసరం అయితే రెండు కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తారు. ఇక రష్మిక గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? ఆమె రేంజ్ ఆకాశంలో ఉంది. అందుకు తగ్గట్టుగానే రష్మిక తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది. ఎలాగూ రష్మిక మందన్నా హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయం అయింది. రష్మిక మందన్నాకి హిందీ ప్రేక్షకుల్లో ప్రస్తుతం ఫుల్ పాపులారిటీ ఉంది.
‘పుష్ప’ హిందీ వర్షన్ పెద్ద హిట్ కావడం, రష్మిక మందన్నా క్యారెక్టర్ బాగా పాపులర్ కావడం ఆమెకి కలిసొచ్చాయి. ఇప్పుడు హిందీలో రష్మిక మందన్నాకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అమితాబ్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది. అలాగే మిస్టర్ మజ్ను అనే హిందీ సినిమాలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే, రష్మిక మందన్నాకి హిందీలో ఛాన్స్ లు రావడం వెనుక విజయ్ హస్తం ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండకి కరుణ్ జోహార్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. రష్మిక మందన్నాను కరుణ్ జోహార్ కి పరిచయం చేసింది విజయ్ దేవరకొండ అని.. ప్రస్తుతం రష్మిక హిందీ సక్సెస్ అసలైన కారకుడు విజయ్ అని టాక్ నడుస్తోంది.
Also Read:Alia Bhatt: సూపర్ స్టార్లు కంటే ఎక్కువ సంపాదిస్తున్న హీరోయిన్..? ఎవరు ఆమె ? ఏమిటి కారణం ?