https://oktelugu.com/

krithi shetty- Nithin: నితిన్ పై ‘కృతి శెట్టి’ సంచలన కామెంట్స్.. నితిన్ అలాంటి వ్యక్తి అట

krithi shetty- Nithin: ‘కృతి శెట్టి’లో హీరోయినే కాదు, కమర్షియల్ పిల్ల కూడా ఉంది. మంచి తెలివి తేటలు కూడా ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘కృతి శెట్టి’ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ‘కృతి శెట్టి’ మాట్లాడుతూ నితిన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ ఏం మాట్లాడింది అంటే.. ‘కృతి […]

Written By:
  • Shiva
  • , Updated On : August 7, 2022 / 06:33 PM IST
    Follow us on

    krithi shetty- Nithin: ‘కృతి శెట్టి’లో హీరోయినే కాదు, కమర్షియల్ పిల్ల కూడా ఉంది. మంచి తెలివి తేటలు కూడా ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘కృతి శెట్టి’ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ‘కృతి శెట్టి’ మాట్లాడుతూ నితిన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

    krithi shetty- Nithin

    ఇంతకీ ఈ బ్యూటీ ఏం మాట్లాడింది అంటే.. ‘కృతి శెట్టి’ మాటల్లోనే.. ‘నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం ఉంది. ఇక ఈ మూవీలో నా పాత్ర పేరు స్వాతి. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది’ అని చెప్పుకొచ్చింది. కృతి ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నిజానికి ఉప్పెన తర్వాత చాలా వరకు అలాంటి పాత్రలే వచ్చాయి, అయితే జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నానని చెప్పింది.

    Also Read: Alia Bhatt: సూపర్ స్టార్లు కంటే ఎక్కువ సంపాదిస్తున్న హీరోయిన్..? ఎవరు ఆమె ? ఏమిటి కారణం ?

    ఏది ఏమైనా తనకు వచ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది. మొదట్లో నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకునేది. కానీ, వరుస హిట్లు వస్తుండటం.. పైగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తుండటంతో కృతి శెట్టి రెమ్యునరేషన్ ను రెండింతలు పెంచింది. సినిమాకి ఇప్పుడు 2 కోట్లు అడుగుతుందట. పైగా హీరో రేంజ్ ను బట్టి డబ్బులు అడుగుతుంది.

    మొత్తానికి ‘కృతి శెట్టి’ మాత్రం సినిమా ఇండస్ట్రీలో బాగా తెలివిమీరి పోయింది. సీనియర్ హీరోయిన్స్ కే సాధ్యం కానీ, మేనేజ్ మెంట్ ను ‘కృతి శెట్టి’ సింపుల్ గా మ్యానేజ్ చేసుకుంటూ పోతుంది. పైగా ఏ ఇండస్ట్రీకి వెళ్తే.. ఆ ఇండస్ట్రీ పద్దతులను ఫాలో అవుతూ.. అక్కడ హీరోలను డైరెక్టర్లను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటున్న హీరోయినన్స్ లో ‘కృతి శెట్టి’ నే ముందు ప్లేస్ లో ఉంది.

    krithi shetty- Nithin

    ఎలాగూ ‘కృతి శెట్టి’ ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. కారణం తమిళంలో ‘కృతి శెట్టి’ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. అందుకే ఎక్కువగా చెన్నైలోనే ఉంటూ అక్కడ స్టార్ హీరోలను రెగ్యులర్ గా కలుస్తోంది ‘కృతి శెట్టి’ . బిగ్ ఛాన్స్ ల కోసం తన వంతుగా ‘కృతి శెట్టి’ కొన్ని కసరత్తులు, ప్రయత్నాలు చేస్తోంది. అయితే, మిగిలిన సౌత్ భామలు అందాల ప్రదర్శనలో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. దాంతో తమిళ పద్దతికి తగ్గట్లు మేకోవర్ అయిపోయింది ‘కృతి శెట్టి’.

    Also Read:Dulquer Salmaan- Jagan Biopic: వైఎస్ జగన్ బయోపిక్ లో నటించబోతున్న ప్రముఖ స్టార్ హీరో

    Tags