Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna Rakshith Shetty Breakup Reason: హీరోయిన్ రష్మిక తో రక్షిత్ శెట్టి ఆరోజుల్లో...

Rashmika Mandanna Rakshith Shetty Breakup Reason: హీరోయిన్ రష్మిక తో రక్షిత్ శెట్టి ఆరోజుల్లో నిశ్చితార్థం రద్దు చేయడానికి కారణం అదేనా..?

Rashmika Mandanna Rakshith Shetty Breakup Reason: ఈనెల 26న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్లి జరగబోతున్న సందర్భంగా, సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి పేర్లే ట్రెండ్ అవుతున్నాయి. వీళ్లకు సంబంధించిన కొత్త విషయాలతో పాటు, పాత విషయాలను కూడా తవ్వి తీస్తున్నారు నెటిజెన్స్. విజయ్ దేవరకొండ కి ఒక మాజీ ప్రేయసి ఉందని, ‘నోటా’ సినిమా వరకు ఆమెతోనే ఆయన కలిసి ఉన్నాడని సోషల్ మీడియా లో ఫొటోలతో సహా అప్లోడ్ చేశారు. ఇక రష్మిక విషయానికి వస్తే, ఈమె కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి(Rakshith Shetty) తో ప్రేమాయణం నడిపి, అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థం తర్వాతే రష్మిక ‘గీత గోవిందం’ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది. అయితే రక్షిత్ శెట్టి కొన్ని విషయాల్లో చాలా కచ్చితంగా ఉంటాడని తెలుస్తోంది.

పెళ్ళికి ముందే రష్మిక కి ఆయన కొన్ని ఆంక్షలు పెట్టాడట. పెళ్లి తర్వాత సినిమాల్లో రష్మిక నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ముద్దు సన్నివేశాల్లో మాత్రం నటించకూడదు అని రూల్ పెట్టాడట. రష్మిక అందుకు ఓకే కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ‘గీత గోవిందం’ క్లైమాక్స్ లోని బస్సు సన్నివేశం లో విజయ్ దేవరకొండ కి రష్మిక ముద్దులు పెడుతుంది. ఈ సన్నివేశం అప్పట్లో సినిమా విడుదలకు ముందే లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. పెళ్లి కి ముందే రష్మిక తనకు ఇచ్చిన మాట ని తప్పడంతో కోపగించుకున్న రక్షిత్ శెట్టి, నిశ్చితార్థం ని రద్దు చేసుకున్నాడట. ఈ సన్నివేశం లీక్ అయ్యినప్పుడు వీళ్లిద్దరి మధ్య చాలా గొడవలు కూడా అయ్యాయి అట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మూవీ టీం ఆ సన్నివేశాన్ని చిత్రం నుండి తొలగించారట. ఇప్పటికీ కూడా మీరు ఈ సినిమాని చూస్తే, క్లైమాక్స్ లో ఈ సన్నివేశం ఉండదు.

అలా కేవలం ఒక ముద్దు సన్నివేశం కారణంగా వీళ్ళ మధ్య బ్రేకప్ అయ్యిందని తెలుస్తోంది. బ్రేకప్ ని రష్మిక తీసుకోలేకపోయింది అట. చాలా కాలం వరకు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అప్పటికే విజయ్ దేవరకొండ తో ఆమెకు మంచి స్నేహం ఉంది. డిప్రెషన్ సమయం లో ఆమెకు ఇంకా అండగా నిలబడడంతో వీళ్ళ మధ్య స్నేహం ఇంకా దృఢపడింది. ఆ స్నేహం కాస్త కాలం గడిచే కొద్దీ ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చింది అట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం రష్మిక కి పెళ్లి తర్వాత ఎలాంటి కండీషన్స్ ఉండబోవని ముందే చెప్పేశాడట. ఇంతకు ముందు ఎలా అయితే సినిమాలు చేస్తూ వచ్చిందో, అలాగే చేయొచ్చని చెప్పాడట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version