Mysaa Movie First Look: రష్మిక(Rashmika Mandanna) అనగానే మనకి ఒకప్పుడు క్యూట్ & బబ్లీ రోల్స్ మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ పుష్ప సినిమా తర్వాత ఆమె రూట్ మార్చింది. కేవలం హీరో పక్కన డ్యాన్స్ వేసి, హీరో తో రొమాన్స్ చేసే క్యారెక్టర్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. పుష్ప తర్వాత ఆమె చేసిన ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘చావా’, ‘కుబేర’ చిత్రాల్లో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేసింది. ఈ సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే రష్మిక ఇప్పుడు తనని తానూ మరింత అప్ గ్రేడ్ చేసుకునే పనిలో పడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇప్పటికే రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వం లో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న రష్మిక,నిన్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సంబంధించిన చిన్న పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also Read: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ…
ఈ సినిమా టైటిల్ ని ఊహించి కరెక్ట్ గా చెప్పినవాళ్లను నేను కచ్చితంగా కలుస్తానని చెప్పుకొచ్చింది రష్మిక. నేడు ఆమె ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని టైటిల్ తో సహా రిలీజ్ చేసింది. ఈ సినిమా పేరు మైసా(Mysaa Movie) అట. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ‘మీ అందరికీ నా నుండి ది బెస్ట్ ఇవ్వాలని, డిఫరెంట్ అనుభూతి ఇవ్వాలని నేను కష్టపడుతూ ఉంటాను. ఈ మైసా కూడా అలాంటి ప్రయత్నం తో తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చేయని క్యారక్టర్ ఇది. ఇలాంటి వెర్షన్ కూడా నాలో ఉందా అని నన్నే ఆశ్చర్యపరిచిన పాత్ర ఇది. ఈ సినిమా ని మీ ముందుకు ఎప్పుడెప్పుడు తీసుకొస్తానా అని ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ‘మైసా’ అంటే చాలా మందికి అర్థం తెలియకపోవచ్చు.
ఇస్లామిక్ దేశాల్లో ఆడ దేవత ని వాళ్ళ భాషలో ‘మైసా’ అని పిలుస్తారు. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో రష్మిక గెటప్ చాలా భయంకరంగా ఉంది. అమ్మోరు తల్లికి పూనకం వస్తే ఎలా ఉంటుందో అలాంటి లుక్ లో ఆమె కనిపించింది. కచ్చితంగా ఆమెకు ఈ క్యారక్టర్ చేయడం ఒక సరికొత్త అనుభూతే. మరి ఆ క్యారక్టర్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని ప్రాంతీయ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. 2021 వ సంవత్సరం లో ఈయన అర్థ శతాబ్దం అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా అంతగా గుర్తింపు తీసుకొని రాలేదు. కనీసం ఈ సినిమా అయినా ఆయనకు తగిన గుర్తింపు తీసుకొస్తుందో లేదో చూద్దాం.
I always try to give you something new… something different… something exciting…
And this… This is one of those..❤️A character I’ve never played before… a world I’ve never stepped into… and a version of me that even I hadn’t met till now..
It’s fierce.. it’s intense and… pic.twitter.com/bEH6JYCiQO— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2025