Manchu Manoj reaction Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రానికి పెద్ద మైనస్ అని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు ఒక మంచి భక్తిరస చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుందట. మంచు విష్ణు నటన కూడా బాగుందని అంటున్నారు. ఇది ఓవర్సీస్ నుండి వచ్చిన టాక్. ఇండియా లో షోస్ పూర్తి అయ్యాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. మంచు విష్ణు సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడి ఎన్నో ఏళ్ళు అయ్యింది. కానీ నేడు ‘కన్నప్ప’ చిత్రానికి దాదాపుగా ప్రతీ చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల సందర్భంగా నిన్న సాయంత్రం మంచు మనోజ్(Manchu Manoj) మూవీ టీం కి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: Kannappa Runtime: కన్నప్ప సినిమా రన్ టైం ఎంతంటే..
అయితే ఆయన వేసిన ట్వీట్ లో సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరి పేరుని ప్రస్తావించాడు కానీ హీరో గా చేసిన మంచు విష్ణు పేరు ని మాత్రం ప్రస్తావించలేదు. నిన్న జరిగిన విలేఖరుల సమావేశం లో ఒక రిపోర్టర్ మంచు మనోజ్ వేసిన ట్వీట్ గురించి ప్రస్తావించగా, మంచు విష్ణు అందుకు సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఇదంతా పక్కన పెడితే నేడు మంచు మనోజ్ హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ‘కన్నప్ప’ మూవీ ని చూసేందుకు వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగ్ వైరల్ అయ్యింది. ఇక మంచు మనోజ్ సినిమా చూసి వచ్చిన తర్వాత ట్విట్టర్ లో ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. మంచు విష్ణు తో ఆయనకు గొడవలు ఉన్నప్పటికీ, తండ్రి మోహన్ బాబు ని దేవుడితో సమానంగా పోలుస్తుంటాడు మంచు మనోజ్.
Also Read: Kannappa Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ…
ఈ చిత్రాన్ని కూడా తన తండ్రి మోహన్ బాబు కోసమే థియేటర్ కి వెళ్లి చూశానని చెప్పినా చెప్పొచ్చు. ఇకపోతే గతంలో తన భైరవం చిత్రాన్ని కన్నప్పకి పోటీగా విడుదల చేస్తానని ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రాక్టికల్ గా అది కుదర్లేదు. కానీ ‘భైరవం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. చూస్తుంటే ఆ సినిమాకి వచ్చిన వసూళ్లు ‘కన్నప్ప’ కి కేవలం రెండు రోజుల్లోనే రావొచ్చు. ఒకవేళ పోటీగా విడుదల చేసుంటే మంచు మనోజ్ కి పరువు పొయ్యి ఉండేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పోటీ ఆడియన్స్ కి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉండేదని, అన్నదమ్ములలో ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి ఉండేదని మరికొంతమంది అంటున్నారు.
#ManchuManoj was snapped arriving at Prasads Multiplex to watch #Kannappa. pic.twitter.com/Te89VziD8l
— Gulte (@GulteOfficial) June 27, 2025