Rashmika Mandanna: ఈ జనరేషన్ బోల్డ్ హీరోయిన్స్ లో రష్మిక మందాన ఒకరు. మనసులోని భావం ఏదైనా కుండబద్దలు కొడుతుంది. ఆమె నిర్ణయాలు, కామెంట్స్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయి. ఆ కారణంగానే ఆమె కన్నడ పరిశ్రమ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. కన్నడ అమ్మాయి అయిన రష్మిక కెరీర్ మాత్రం ఇతర భాషల్లో వెతుక్కుంటున్నారు. ఆరంభంలోనే ఆమె వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. కిరాక్ పార్టీతో వెండితెరకు పరిచయమైన రష్మిక మందాన ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లి చేసుకుంటే సినిమాలు వదులుకోవాల్సి వస్తుందని రష్మీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

ఇది రక్షిత్ శెట్టి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. రష్మిక విపరీతమైన ట్రోలింగ్ కి గురైంది. రష్మిక కన్నడ పరిశ్రమకు దూరం కావడానికి అది ఒక కారణమైంది. ఈ మధ్య ఆమె చేసిన కొన్ని కామెంట్స్ పై కన్నడ చిత్ర పరిశ్రమ మండిపడుతోంది. రష్మికను బ్యాన్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రష్మిక హీరోయిన్ గా ఉన్న పుష్ప 2, వారసుడు చిత్ర నిర్మాతలు భారీగా నష్టపోతారు. కర్ణాటక మార్కెట్ మొత్తం వదులుకోవాల్సి వస్తుంది.
ఇదిలా ఉంటే రష్మిక ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ముందుకు వెళుతుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె క్రేజీ కామెంట్స్ చేశారు. ఒక అభిమానితో డేటింగ్ కి వెళ్లాల్సి వస్తే ఏం చేస్తారు? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అని అడగ్గా.. రష్మిక స్పందించారు. అభిమానితో డేటింగ్ కి వెళ్లడంలో తప్పులేదు. అది చాలా ఫన్నీగా ఉంటుందంటూ, సమాధానం చెప్పింది. నిజంగా అలాంటి సందర్భం వస్తే రష్మిక భయపడకుండా ఫేస్ చేస్తుందనిపిస్తుంది.

కాగా హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది. ఇటీవల ఇద్దరూ ఒకేసారి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. దీంతో వారి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే పుకార్లకు బలం చేకూరింది. వారు మాత్రం మేము మంచి మిత్రులం మాత్రమే అంటారు. మరి వాస్తవం ఏమిటో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాలి. మరోవైపు విజయ్ వారసుడు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. హిందీ చిత్రం యానిమల్ షూటింగ్ జరుపుకుంటుంది.