Neha Marda: బుల్లితెర పై సంచలన విజయం సాధించిన సీరియల్స్ లో ఒకటి ‘చిన్నారి పెళ్లి కూతురు’..అప్పట్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు..బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఫేమస్ అయ్యారు..వారిలో నేహా మర్దా కూడా ఒకరు..ఈ సీరియల్ లో దాది సా పెద్ద కోడలిగా నేహా అద్భుతమైన నటనని చూపించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

ఈ సీరియల్ బాగా హిట్ అవ్వడం తో ఆమెకి ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించే అవకాశం లభించింది..అంతే కాకుండా ఈమె ఎన్నో డాన్స్ షోస్ కి కూడా పాల్గొంది..సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే నేహా కి కుర్రకారుల్లో ఉందొ క్రేజ్ మామూలుది కాదు..ఎప్పటికప్పుడు ఈమె చేసే ఇంస్టాగ్రామ్ రీల్స్ కి మిలిన్స్ కొద్దీ వ్యూస్ మరియు ఫోటోలకు లక్షలకొద్దీ లైక్స్ వస్తూ ఉంటాయి.
ఇది ఇలా ఉండగా ఈమె బుల్లితెర ఆర్టిస్టు గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రోజుల్లోనే 2012 వ సంవత్సరం లో ఆయుష్మాన్ అగర్వాల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది..కానీ పెళ్ళై పదేళ్లకు పైగానే గడుస్తున్నప్పటికీ నేహా కి సంతానం కలగకపోవడం పై బాలీవుడ్ లో పెద్ద చర్చ నడిచేది..అయితే అలాంటి చర్చలకు తెరదించుతూ ఈమె త్వరలోనే తల్లి కాబోతున్నాను అంటూ తన భర్త తో కలిసున్నా ఫోటో ని షేర్ చేసి అభిమానులతో పంచుకుంది..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా జీవితం లో మొట్టమొదటిసారి మాట్లాడలేనంత ఆనందకరమైన సందర్భం వచ్చింది..2023 వ సంవత్సరం లో మా కుటుంబం లోకి మూడవ వ్యక్తి రాబోతున్నాడు’ అంటూ ఒక ఫోటో షేర్ చేసింది.

ఈ ఫోటో లో ఆమె బేబీ బంప్ తో ఉండడం చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు..కేవలం అభిమానులు మాత్రమే కాదు ఆమెతో కలిసి పని చేసిన తోటి నటీనటులు మరియు ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా నేహా కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.