Electricity Bill Scam: దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో కొత్త తరహా మార్గాలు అన్వేషిస్తున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విభిన్నంగా ప్లాన్ చేసుకుని మరీ డబ్బు దోచుకుంటున్నారు. క్షణాల్లో మన ఖాతా నుంచి డబ్బు మాయం కావడంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. పోలీసులను సంప్రదిస్తే వారు కూడా ఏం చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో వాటి గురించి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు.

హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం కు చెందిన ఓ సైబర్ నేరాల గురించి పిల్లలకు అవగాహన కల్పించే అధ్యాపకురాలికి ఓ ఫోన్ వచ్చింది. మీ కరెంటు బిల్లు పెండింగులో ఉంది. మీ కరెంటు కట్ అవుతుంది. ఇప్పుడు కొంత డబ్బు పంపండి. తరువాత మిగతాది పంపొచ్చు అనే మాటలు వినబడటంతో ఆమె తన ఖాతా నుంచి డబ్బు పంపించింది. దీంతో మరు క్షణమే తన ఖాతా నుంచి రూ. లక్ష మాయమయ్యాయి. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు మాత్రం దొరకలేదు. ఇలా మోసం చేసి డబ్బు సంపాదించేందుకు కొందరు పనిగట్టుకుని ఉంటున్నారు.
ఎవరైనా మీ కరెంటు బిల్లు పెండింగులో ఉందని ఫోన్ చేస్తే నమ్మకండి. వారికి ఎలాంటి వివరాలు ఇవ్వకండి. మీ ఖాతా నుంచి డబ్బు పంపకండి. ఒకవేళ అలాంటి ఫోన్ వస్తే మీరే ఆఫీసుకు వెళ్లి క్లారిఫై చేసుకుని తరువాత డబ్బు చెల్లించండి. అంతేకాని ఎవరో ఫోన్ చేస్తే చటుక్కున డబ్బు పంపి మోసానికి గురి కాకండి. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి మనం ఎంత కష్టపడతామో తెలుసు కదా. అందుకే మోసాన్ని మొదట్లోనే తెగ నరకండి. అనుమానితులు ఫోన్లు చేస్తే తక్షణమే స్పందించకండి.

ఫోన్ వచ్చినా వివరాలు ఆరా తీసినాకే డబ్బు చెల్లించండి. మనకు వారి మాటలు ఆకర్షణీయంగా కాకుండా మోసం లేకుండా చూసుకునే క్రమంలో పొరపాట్లు చేయకండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి. డబ్బు అప్పనంగా ఎవరికి దోచి పెట్టకండి. మన జాగ్రత్తల్లో మనం ఉంటే డబ్బు ఎట్టి పరిస్థితుల్లో కూడా చోరీకి గురికాదు. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా అనుమానితులు ఫోన్లు చేస్తే మొదట ఆరా తీశాకే తరువాత డబ్బు ఇవ్వండి. అలా కాకుండా వారు ఏదో చెబితే మీరు ఏదో చేసి డబ్బులు పంపడం సముచితం కాదు.